అన్వేషించండి

TS Secretariat : మహారక్షణ వలయంలో కొత్త సెక్రటేరియట్, భద్రత బాధ్యతలు టీఎస్ఎస్పీకి అప్పగింత

సచివాలయ సెక్యూరిటీ బాధ్యతలు TSSPకి అప్పగింతTSSP నుంచి నిరంతరం మూడు కంపెనీల గస్తీ

Telangana News :  కొత్త సచివాలయం శత్రుదుర్భేద్యం! సెక్యూరిటీ కన్నుగప్పి చీమ కూడా లోపలికి దూరలేదు! సెక్రటేరియట్ చుట్టూ ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. సుమారు 470 మంది సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అక్టోపస్ నుంచి స్పెషల్ యూనిట్ గస్తీలో ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే బాధ్యతను TSSP చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయాన్ని శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను డీజీపీ అంజనీకుమార్‌ తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (TSSP) కు అప్పగించారు.  

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న సచివాలయాన్ని చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది సందర్శకులు క్యూ కడుతున్నారు. సచివాలయం ప్రారంభమైన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజల రాకతో సచివాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందున భద్రతాపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సచివాలయానికి పోలీస్‌ శాఖ ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసింది.

మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు TSSP నుంచి మూడు కంపెనీల బలగాలు నిరంతరం గస్తీ కాస్తాయి. సచివాలయానికి పక్కనే అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం, ఎన్టీఆర్‌ ఘాట్‌, పక్కనే హుస్సేన్‌ సాగర్‌, నెక్లెస్‌ రోడ్‌ ఈవెంట్స్‌, ఆ పక్కనే ఐమాక్స్‌ ఉండటం, ఆ ప్రాంతమంతా టూరిస్ట్‌ స్పాట్‌గా మారడంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. TSSP బెటాలియన్‌ నుంచి ఒక్కో కంపెనీలో 90 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ముగ్గురు కమాండెంట్లు, ఆరుగురు అసిస్టెంట్‌ కమాండెంట్లు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు సిబ్బంది ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు 12 మంది, ఏఎస్‌ఐలు 18 మంది, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 90 మంది ఉంటారు. ఇలా మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పాత సచివాలయానికి కేవలం 150 మంది ఎస్‌పీఎఫ్‌ సిబ్బందితో రక్షణ కల్పించేవారు. కొత్త సచివాలయానికి ఆ సంఖ్య నాలుగింతలు పెరిగింది.

ఆక్టోపస్ కూడా అక్కడే ఓ కన్నువేసి ఉంటుంది

TSSP కంపెనీల బలగాలకు తోడు ఆక్టోపస్‌ నుంచి ఓ యూనిట్‌ను సచివాలయ భద్రతకు కేటాయించారు. ఈ స్పెషల్‌ యూనిట్‌లో మొత్తం 21 మంది సిబ్బంది ఉంటారు. వీరికి ర్యాంకులవారీగా విధి విధానాలు ఉంటాయి. సిటీ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన 80 మంది సిబ్బంది కూడా సచివాలయ భద్రతలో భాగం కానున్నారు. వీరు ప్రత్యేకంగా చెకింగ్‌, బ్యాగేజీ చెకింగ్‌, బాంబ్‌, మెటల్‌ చెకింగ్‌ వంటి విధులు నిర్వర్తిస్తారు. ఈ విభాగంలో అడిషనల్‌ డీసీపీ ర్యాంకు అధికారి ఒకరు, ఏసీపీ ర్యాంకు అధికారులు ముగ్గురు, ఆర్‌ఐలు ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సివిల్‌ పోలీసుల (సివిల్‌ ఫోర్స్‌) నుంచి ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, మిగతా సిబ్బంది మొత్తం కలిపి 32 మంది కేవలం సచివాలయ భద్రత కోసం పనిచేస్తారు. ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి అడిషనల్‌ ఎస్పీ ఒకరు, ఏసీపీ ఒకరు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది భద్రతలో భాగమవుతారు. ఇక స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, సుమారు 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

సచివాలయ పరిసరాల పరిధిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సుమారు 25 మంది ట్రాఫిక్‌ సిబ్బంది షిఫ్టులవారీగా విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం సెక్రటేరియట్‌కు 22 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని కేటాయించారు. ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, మిగిలిన ర్యాంకుల సిబ్బంది ఉంటారు. వీరు సెక్రటేరియట్‌ పార్కింగ్‌, సీఎం మూమెంట్‌, మంత్రుల పార్కింగ్‌, విజిటర్స్‌ పార్కింగ్‌, ఉద్యోగులు, పౌరుల కోసం పనిచేస్తారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ భారీ విగ్రహం, సచివాలయ ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉండటంతో.. సచివాలయంలోకి వెళ్లే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు విధులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్‌ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన మరుక్షణమే సిబ్బందిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

 468 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇక నుంచి అంబేద్కర్‌ నూతన సచివాలయం భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చూసుకుంటుంది. సిటీ పోలీస్‌, ఆక్టోపస్‌, ఇంటలిజెన్స్‌, ట్రాఫిక్‌ వంటి విభాగాలను సమన్వయం చేసుకొంటూ కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు. రక్షణ విషయంలో రాజీ లేకుండా పహారా కాసే మూడు కంపెనీల సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మొత్తం 300 మందిని సిద్ధంగా ఉంచారు. వీరంతా త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పౌరులు, సచివాలయ భద్రత దృష్ట్యా సిబ్బందిని మరింత పెంచే అవకాశం ఉంది. నూతన సచివాలయ భద్రతకు సంబంధించి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో)గా టీఎస్‌ఎస్పీ 3వ బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి.వెంకట్రాములుకు బాధ్యతలు అప్పగించారు. కొత్త సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందించేందుకు సుమారు 468 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. భద్రత విషయంలో రాజీ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు  తీసుకుంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget