అన్వేషించండి

Medigadda dam safty Report : ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిన మేడిగడ్డ - కేంద్ర కమిటీ నివేదికలో కీలక విషయాలు

మేడిగడ్డ కుంగిపోవడంపై కేంద్ర కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిందని అంచనాకు వచ్చింది. తెలంగాణ సర్కార్ ఇంకా వివరాలు ఇవ్వాల్సి ఉందని తెలిపింది.

Medigadda dam safty Report :   మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ  కీలక  నివేదిక  ఇచ్చింది.  పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రిట్ కూడా తొలగిపోయిందని, బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటినెన్స్.. మొత్తం ఈ నాలుగు విషయాల్లో వైఫల్యం చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.   మొత్తం 43 పేజీల్లో సమగ్రమైన నివేదికను కేంద్ర  కమిటీ ఇచ్చింది. 

బ్యారేజీని ఇప్పుడల్లా నీటితో నింపలేరు !                                  

బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది.  కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. ఇన్స్ట్రుమెంటేషన్ , వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు,  కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్‌ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్‌ అథారిటీ పేర్కొనడం గమనార్హం. 
Medigadda dam safty Report : ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిన మేడిగడ్డ - కేంద్ర కమిటీ నివేదికలో కీలక విషయాలు

పిల్లర్లు కుంగడానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ చెప్పిన కారణాలు

+ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం  
+బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది
+ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదు
+బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయింది 
+బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారు కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు 
+బ్యారేజీ వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రజా జీవితానికి తీవ్ర ప్రమాదం
+బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ని ఉపయోగించడానికి అవకాశం లేదు
+ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుంది
Medigadda dam safty Report : ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిన మేడిగడ్డ - కేంద్ర కమిటీ నివేదికలో కీలక విషయాలు

అన్నారం సుందిళ్ల బ్యారేజీలపైనా ప్రభావం 

అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మేడిగడ్డ తరహాలోనే అన్నారం,  సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయి’’ అని తన నివేదికలో డ్యామ్‌ అథారిటీ పేర్కొంది.
Medigadda dam safty Report : ప్లానింగ్, డిజైన్, నాసిరకం నిర్మాణం వల్లే కుంగిన మేడిగడ్డ - కేంద్ర కమిటీ నివేదికలో కీలక విషయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget