News
News
వీడియోలు ఆటలు
X

Answer Sheets Missing: తెలంగాణ పది పరీక్షల్లో మరో తప్పిదం! ఆన్సర్ షీట్ల కట్ట మిస్సింగ్ - ఆందోళనలో స్టూడెంట్స్

ఉట్నూరు పట్టణంలో దాదాపు వెయ్యి మందికి పైగా పరీక్ష రాశారు. మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయిన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో ఘటన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం విద్యార్థులు తెలుగు పరీక్ష రాయగా, నేడు ఆ జవాబు పత్రాల్లో ఓ బండిల్ (కట్ట) మాయం అయింది. అయితే, ఈ జవాబు పత్రాల కట్ట ఏ పరీక్ష కేంద్రానికి సంబంధించిందో ఇంకా తెలియలేదు. దీంతో ఆ ప్రదేశంలో పరీక్ష రాసిన అందరు ఆందోళన చెందుతున్నారు.

ఉట్నూరు పట్టణంలో దాదాపు వెయ్యి మందికి పైగా పరీక్ష రాశారు. మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో పరీక్ష రాసిన విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఆ కేంద్రాల ఇంఛార్జిలు సీల్ చేసి పోస్ట్ ఆఫీసులో అప్పగించారు. అక్కడి సిబ్బంది ఆన్సర్ షీట్లను మూల్యాంకన కేంద్రాలకు (ఇవాల్యుయేషన్ సెంటర్స్) తరలించేందుకు బస్టాండ్‌కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి ఆన్సర్ షీట్ల కట్టలను లెక్కించగా.. 11కు బదులు 10 కట్టలే ఉండడంతో జవాబు పత్రాల కట్ట కోసం వారు వచ్చిన మార్గంతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్‌ పోస్ట్ మాస్టర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

మిగతా 'పది' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి!
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠ‌శాల‌-1లో సోమ‌వారం ఉద‌యం తెలుగు ప్రశ్నాప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 4న జరిగే ప‌రీక్ష వాయిదా వేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల‌పై రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డ‌లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వ‌ర‌కు అన్ని ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాప‌త్రాన్ని వాట్సాప్ ద్వారా బ‌య‌ట‌కు పంపిన వ్యవ‌హారంలో న‌లుగురు ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ‌సేన ప్రక‌టించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో పది పేపర్ లీక్, పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ గ్రూప్ లో ప్రశ్నాపత్రం
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారులకు షాక్ తగిలింది. పరీక్ష ప్రారంభమై ఏడు నిమిషాలకే పేపర్‌ లీక్ అయింది. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో తెలుగు పేపర్ లీకైనట్టు అధికారులు గుర్తించారు. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభమైంది. ఇంతలోనే పేపర్ లీక్ కావడంతో అంతా అవాక్కయ్యారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే లీక్‌ ఎలా అయిందనే అనుమానం అందరిలో వ్యక్తమైంది. లీక్‌పై ఆరా తీస్తే ఓ టీచర్ దీన్ని లీక్ చేసినట్టు తేల్చారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆయన్ని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. అసలు కారకులు ఎవరు దేని కోసం ఇలా లీక్ చేశారనే కోణంలో విచారణ సాగుతోంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 04 Apr 2023 09:09 AM (IST) Tags: Adilabad District Telangana SSC Tenth Exams Answer sheets bundle utnoor news

సంబంధిత కథనాలు

Sharmila Meet Sivakumar  : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ -  కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

టాప్ స్టోరీస్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12