By: ABP Desam | Updated at : 23 May 2022 07:33 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణ పదో తరగతి పరీక్షలు
TS SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సద్ధమైంది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలల్లో చదువుతున్న 5 లక్షల 9 వేల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 2861 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
కరోనా తర్వాత తొలిసారి పరీక్షలు
కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచునున్నారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా అప్రమత్తం అయింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయి అధికారులతో సిట్టింగ్ స్కాడ్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే డీఈవో, ఎంఈవోలు బాధ్యత వహించాలని విద్యాశాఖ సూచించింది.
ఐదు నిమిషాలు లేట్ అయితే అనుమతి లేదు
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒత్తిడికి లోను పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షలకు నూటికి నూరు శాతం విద్యార్థులు హాజరై పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. విద్యార్థులు టైమ్ కి పరీక్ష కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బస్ పాస్ తో పాటు హాల్‌టికెట్ ఉంటే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్‌కు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీస్తే తట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. చట్టప్రకారం శిక్షలుంటాయని అధికారులు తెలిపారు.
Also Read : Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, ఎమ్మెల్సీ కవిత సీరియస్!
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్