TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు, దానిపైనే ఫోకస్!
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. అయితే ఫాం హౌజ్ లో ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం సాగుతుందనే దానిపై ఫోకస్ పెట్టారు.
TRS MLAs Poaching Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ ప్రత్యేక బృందం బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫామ్ హౌస్ లో ఆరోజు ఏం జరిగింది, అసలు ఎన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడుస్తుందన్న దానిపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అటు శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో టెక్నికల్, సైంటిఫికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో మరొకవైపు అదనపు టీమ్స్ ని ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు డిలీటెడ్ డేటాను సేకరించే పనిలో పడ్డారు. వారి డేటాను బ్యాకప్ చేయించారని సమాచారం. అలాగే అటు లాప్ టాప్ లో ఉన్న కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏకంగా లక్ష పేజీల ఉండే సమాచారం సిట్ బృందం సేకరించినట్లు తెలిసింది.
ముఖ్యంగా 7075779637 నంబరుతో కూడిన శామ్ సంగ్ మొబైల్ ను రామచంద్రభారతి వినియోగించారు. ఆ ఫోన్లో 8762090655 వాట్సాప్ నంబరుతో విరివిగా చాటింగ్లు ఉన్నాయి. 9110662741 నంబరుతో కూడిన మరో ఫోన్ దొరికింది. ఫామ్ హౌస్ లో ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వాటి నుంచి సమాచారం సేకరించడంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషించారు. అప్పటికే తొలగించిన డేటాను రికవరీ చేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో సమాచారం లభ్యమైంది. ఆ ఫోన్ల నుంచి సునీల్ కుమార్ బన్సల్, బీఎల్ సంతోష్, తుషార్ వెళ్లాపల్లికి పంపిన మెసేజ్ లు ఉన్నాయి. నిందితుడు నందకుమార్ ఫోన్ లో వందల సంఖ్యలో చాటింగ్ లను గుర్తించారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే విషయంలో ఇద్దరి మధ్య సంభాషణలు ఉన్నాయి. భారతికి చెందిన డెల్ ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. వీటన్నింటినీ విశ్లేషించి పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించారు.
నిందితులతోపాటు అనుమానితులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినవారు కావడంతో పోలీసులు ఆయా ప్రాంతాల నుంచి డేటా సేకరించారు. హైదరాబాద్, ఫరీడాబాద్, తిరుపతి, దిల్లీ, బెంగళూరు, కొచ్చి, ఎర్నాకుళం... తదితర ప్రాంతాల్లో ఉన్న వీరు సెల్ ఫోన్లలో సంభాషణలు సాగించారు. మెసేజ్లనూ షేర్ చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని సుమారు 40 సర్వర్ల నుంచి సిట్ బృందం సమాచారాన్ని తెప్పించింది. ల్యాప్టాప్ ని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదంతా దాదాపు లక్షపేజీల మేర ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవలే మరో ఇద్దరికి నోటీసులు..
కేసుకు సంబంధించిన తీగ లాగుతున్‌న సిట్... కీలకంగా భావించే ముగ్గురికి గత వారం నోటీసులు ఇచ్చింది. సోమవారం(21 నవంబర్)నాడు విచారణకు రావాలని పిలుపునిచ్చింది. సిట్ నోటీసులు పంపిన ముగ్గురిలో కరీంనగర్‌లో న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీనివాస్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు. ఆయన్ని రెండు రోజుల పాటు విచారించింది సిట్ బృందం. మిగతా ముగ్గురు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి మాత్రం విచారణకు రాలేదు... ఎందుకు రావడం లేదో సమాచారం కూడా ఇవ్వలేదు. వాళ్ల విచారణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తూనే మరో ఇద్దరికి తాజాగా నోటీసులు జారీ చేసింది సిట్. నందు భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన అడ్వకేట్ ప్రతాప్ గౌడ్‌కి నోటీసులు ఇచ్చిందది. ఇవాళ కచ్చితంగా విచారణకు రావాలని పిలుపునిచ్చింది.