అన్వేషించండి

Telangana RTC Strike: సమ్మెతో డిపోలకే పరిమితమైన బస్సులు.. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఏంటీ ?

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు కావాలని, కార్మికులు సమ్మె విరమించి తక్షణమే విధులకు హాజరుకావాలని సంస్థ ఎండి వై. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు తమ విధులను బహిష్కరించారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన బస్ డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.

కార్మికులు విధులకు హాజరుకావాలన్న ఆర్టీసీ ఎండీ..

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరుకావాలని సంస్థ TGRTC ఎండీ వై. నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ కమిటీ ఇప్పటికే మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు.

కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సాంకేతిక చిక్కులతో కూడిన అంశాలు ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం అవసరమని నాగిరెడ్డి పేర్కొన్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున, ప్రభుత్వం కోరిన గడువుకు సహకరించాలని ఆయన కోరారు.

అయితే కొన్ని సంఘాలు వాస్తవాలను పక్కనబెట్టి, సమ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, సామాన్య ప్రజలు మరియు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఆయన హితవు పలికారు. సంస్థ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ సమ్మె.. కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఈ సమ్మెలో కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం. సంస్థను కేవలం ఒక కార్పొరేషన్‌గా కాకుండా ప్రభుత్వ శాఖగా గుర్తించి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు 2021 నుండి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, సంస్థే నేరుగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ (JAC) స్పష్టం చేస్తోంది.

సమ్మెను అడ్డుకునేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ప్రభుత్వం జీవో నంబర్ 66 ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, జేఏసీ నాయకులు దానిని ససేమిరా తిరస్కరించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తమ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ చైర్మన్ ప్రకటించడంతో సమ్మె అనివార్యమైంది.

ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులపై పడనుంది. దాదాపు 6,000 బస్సులు డిపోలకే పరిమితం కావడంతో హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చివరకు ఎయిర్‌పోర్ట్ పుష్పక్ సర్వీసులు కూడా నిలిచిపోవడంతో విమాన ప్రయాణికులకు సైతం కష్టాలు మొదలయ్యాయి.

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రైవేట్ వాహనాలు, పాఠశాల బస్సులను తాత్కాలికంగా ప్రయాణికుల కోసం వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో కొన్ని బస్సులను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Embed widget