అన్వేషించండి

Fake Currency: ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు - ఇద్దరు విదేశీయుల అరెస్ట్

Hyderabad News: ఫేక్ కరెన్సీతో ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు విదేశీయులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల నకిలీ కరెన్సీ, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ తెలిపారు.

Two Foreigners Arrested Who Cheating With Fake Currency: తెలంగాణ పోలీసులు ఫేక్ కరెన్సీ (Fake Currency) ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ నోట్లతో ప్రజలను మోసగిస్తోన్న ఇద్దరు విదేశీయులను బుధవారం మల్కాజిగిరి ఎస్ వోటీ అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు (Sudheer Babu) వెల్లడించారు. నిందితులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో రూ.లక్షకు రూ.5 లక్షలు ఇస్తామని ఆశ కల్పిస్తారని చెప్పారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాక వారిపై మత్తు మందు చల్లి పారిపోతారని అన్నారు. ప్రధాన నిందితులైన కోంబి ఫ్రాంక్, గోయిట సొంగాలు కామెరాన్, మాలి దేశాలకు చెందిన వారని పేర్కొన్నారు. వీరి వీసా గడువు ముగిసినా.. వారి దేశాలకు వెళ్లకుండా నకిలీ కరెన్సీతో మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీపీ తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. ఇద్దరు నిందితుల నుంచి రూ.25 లక్షల నకిలీ నోట్లతో పాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారో పూర్తి స్థాయి విచారణ అనంతరం తెలుస్తుందని అన్నారు. 

మోసం బయట పడిందిలా

బోడుప్పల్ వాసి అయిన బాధితుడికి ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నోటిఫికేషన్ వచ్చింది. 'వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్' అనే గ్రూపులో చేరి చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అందులోని ఓ వ్యక్తి తన వద్ద నల్ల కరెన్సీ నోట్లు ఉన్నాయని.. అవి రసాయన ద్రావణంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతాయని నమ్మబలికాడు. దీనికి సంబంధించి డెమో కూడా ఇచ్చారు. దీంతో బాధితుడు వారిని నమ్మి రూ.5 లక్షలు ఇచ్చాడు. వారు బదులుగా రూ.25 లక్షల నల్ల కరెన్సీతో పాటు కొన్ని రసాయన పదార్థాలను ఓ పాలిథిన్ కవర్ లో పెట్టి ఇచ్చారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ప్రయత్నించగా అవి అసలు కరెన్సీగా మారలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విచారించిన ఎస్వోటీ పోలీసులు నిందితులైన విదేశీయులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

Also Read: Mint Compound Fire Accident: మింట్ కాంపౌండ్ లో అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ముద్రణా యంత్రాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget