అన్వేషించండి

Telangana News: బతికుండగానే కన్నతల్లిని శ్మశానంలో వదిలేశాడు - నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన

Nalgonda News: అనారోగ్యంతో ఉన్న కన్నతల్లిని బతికుండగానే శ్మశానంలో వదిలేశాడు ఓ కసాయి కొడుకు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.

Son Left His Mother In Graveyard: నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లినే వదిలించుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. వృద్ధురాలైన అమ్మ అనారోగ్యంతో బాధ పడుతుండగా బతికుండగానే శ్మశానంలో వదిలేశాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం తల్లిని శ్మశానంలో వదిలేయగా, సోమవారం గ్రామస్థులు గుర్తించి, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వృద్ధురాలికి అల్పాహారం అందించి, అక్కడే షెడ్డులో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ జరిగింది:

ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఎర్రావులపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ(70)కు కుమారుడు వెంకటేశ్, ఓ కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా వెంకటరత్నమ్మ అనారోగ్యంతో బాధ పడుతుండగా, కొడుకు వెంకటేశ్ తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు. దీంతో శనివారం కొడుకు, కోడలు కలిసి వృద్ధురాలి చేయి విరగ్గొట్టి, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా వద్ద శ్మశాన వాటిక వద్ద వదిలేసి వెళ్లారు. 3 రోజులుగా ఆ వృద్ధురాలు అలానే పడి ఉంది. సోమవారం పంచాయతీ కార్మికుడు విధి నిర్వహణలో భాగంగా మొక్కలకు నీరు వేసేందుకు అక్కడికి వెళ్లగా, కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని గుర్తించి సర్పంచ్ కు సమాచారం అందించాడు. ఆయన వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలికి అల్పాహారం అందించి, అక్కడే ఓ షెడ్డు ఏర్పాటు చేశారు.

విషయాన్ని పోలీసులకు తెలపగా, వారు వచ్చి వృద్ధురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్యాగులోని ఆధార్, రేషన్ కార్డు ద్వారా వివరాలు సేకరించారు. ఈ సమాచారాన్ని దాచేపల్లి పోలీసులకు తెలిపామని పేర్కొన్నారు. వృద్ధురాలి భర్త బతికే ఉన్నాడని ఆయన పేరు ఏడుకొండలని పోలీసులు తెలిపారు. 

వృద్ధురాలి ఆవేదన

పోలీసులు బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్తే తమ కుమారుడు, కోడలు తనను చంపేస్తారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లాలని కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆమెకు వైద్య సహాయం అందించిన పోలీసులు వివరాలను ఏపీ పోలీసులకు అందజేశారు.

lso Read: CM Kcr: 'పాలమూరును నాశనం చేసింది కాంగ్రెస్' - ఆలోచించి ఓటెయ్యాలన్న సీఎం కేసీఆర్

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget