Harish Rao About Rahul Gandhi: ఆ ఒక్క ప్రశ్నతో రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఏంటో అర్థమైంది: మంత్రి హరీష్ రావు సెటైర్

Harish Rao Tweet On Rahul Gandhi: తెలంగాణలో కాలుపెట్టక ముందే రాహుల్ గాంధీపై విమర్శలు కురిపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆపై రాహుల్ అడిగిన ఒక్క ప్రశ్నతో మరోసారి సెటైర్లు వేస్తున్నారు.

FOLLOW US: 

Harish Rao Tweets On Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో కాలుపెట్టక ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, తెలంగాణ మంత్రులు విమర్శలు మొదలుపెట్టారు. వాటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తెలంగాణలో కాలుపెట్టాక రాహుల్ గాంధీ అడిగిన ఒకప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రైతుల పట్ల రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.

తెలంగాణ రైతులు చైతన్యవంతులని, రాహుల్ అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే వాళ్లు అలాంటి నేతను అసలు నమ్మరని, కచ్చితంగా అది రైతు సంఘర్షణ సభ కానే కాదని, రాహుల్ సంఘర్షణ సభ అని వారికి తెలిసిపోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ‘రాహుల్ గాంధీ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ - చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ - రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు’ అని హరీష్ రావు అన్నారు.

‘ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమేనని’ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వరుస ట్వీట్లు చేశారు.

రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో కీలకమైన అంశాలు 
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ
- రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం
-  ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి  ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం 
- మెరుగైన పంటల బీమా
- గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు
- మిర్చి మద్దతు ధర రూ. పదిహేను 
- వరికి కనీస మద్దతు ధర రూ. రెండున్నర వేలు
- పత్తికి మద్దతు ధర రూ. ఆరున్నరవేలు

-కందులు క్వింటాల్‌కు మద్దతు ధర రూ. ఆరు వేలు
- మొక్కజొన్న మద్దతు ధర రూ. రెండు వేల రెండు వందలు
- తెలంగాణలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం
- భూమి లేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు
- ధరణి పోర్టర్ రద్దు 
- నకిలీ విత్తనాల నివారణకు కఠిన చట్టం  
- నూతన వ్యవసాయ విధానం
- రైతు కమిషన్ ఏర్పాటు  
-  మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్

Also Read: Warangal Rahul Warning : టీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు, గీత దాటితే ఎవరైనా గెంటివేతే - పార్టీ నేతలకు రాహుల్ మాస్ వార్నింగ్

Also Read: Warangal Declaration : రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు మరెన్నో వరాలు - కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌లో కీలక అంశాలు ఇవిగో

Published at : 07 May 2022 01:30 PM (IST) Tags: telangana CONGRESS rahul gandhi harish rao Harish Rao On Rahul Gandhi Telangana Plitics

సంబంధిత కథనాలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల