Covid Updates: తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి... కొత్తగా 2,850 కేసులు, ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,850 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 94,020 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,850 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,66,761కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,091కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 35,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 4,391 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,27,045కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,22,13,954 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,035 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,213 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,620కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,795 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,62,033 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,05,930 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,82,580కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10,795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,05,930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,620కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,25,05,747 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,67,059 కేసులు నమోదుకాగా మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 1,192 మంది మృతి చెందారు. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరించడం వల్లే మరణాలు భారీగా పెరిగాయి. 2,54,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.2గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 17,43,059
- మొత్తం కేసులు: 4,14,69,499
- మొత్తం మరణాలు: 4,96,242
- మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198