By: ABP Desam | Updated at : 17 Jan 2022 08:05 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణలో కరోనా కేసులు(ఫైల్ ఫొటో)
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,138 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2447 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,11,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,060కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,295 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,85,399కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,882 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 4,108 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,510కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 696 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,696 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 30182 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. గడిచిన 24 గంటల్లో 696 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 30182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,510కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,18,84,914 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త శాంతించాయి. నిన్నటితో పోల్చితే 13,113 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. గత రెండు వారాలుగా ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయే, తప్ప తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,58,089 (2 లక్షల 58 వేల 89) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 385 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. నిన్న ఒక్కరోజులో 1,51,740 (ఒక లక్షా 51 వేల 740) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది. క్రితం రోజు కేసులను పరిశీలిస్తే నేడు మూడు లక్షలు దాటేలా కనిపించాయి. అనూహ్యంగా నిన్నటి కన్నా 13 వేల కేసులు తక్కువగా నిర్దారణ అయ్యాయి.
Also Read: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన... పంట నష్టాన్ని పరిశీలించనున్న సీఎం
Karimnagar News : సిరిధాన్యాలతో సిరులు కురిపిస్తున్న మగువలు, విదేశాలకు బిస్కెట్లు, కేకుల ఎగుమతి
Breaking News Live Updates : డ్రాగా ముగిసిన భారత్, పాకిస్తాన్ హాకీ మ్యాచ్
Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై కేసు నమోదు, వైద్యుడి సతీమణి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్!
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
Hyderabad Ganja Seize : హైదరాబాద్ లో భారీగా గంజాయి సీజ్, మహిళలకు కమీషన్ ఆశ చూపి స్మగ్లింగ్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల