Covid Updates: తెలంగాణలో విజృంభిస్తోన్న కోవిడ్... కొత్తగా 2,606 కరోనా కేసులు, ఇద్దరు మృతి... జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికం
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,606 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,606 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,041కి చేరింది. కరోనా నుంచి శుక్రవారం 285 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1583 కేసులు నమోదయ్యాయి.
Also Read: సీనియర్ సిటిజన్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,553 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 839 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,503కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 150 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,440 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 3659 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: భారత్‌లో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు, ఒక్కరోజులో లక్షన్నర మందికి కోవిడ్.. 285 మంది మృతి
దేశంలో కరోనా కేసులు
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,41,986 కోవిడ్ కేసులు నమోదుకాగా దేశంలో నిన్న ఒక్కరోజులో 40,895 రికవరీ అయ్యారు. అదే సమయంలో 285 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
- రోజువారీ పాజిటివిటీ రేటు: 9.28%
- దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 4,72,169
- మొత్తం రికవరీల సంఖ్య: 3,44,12,740
- కరోనా మరణాలు: 4,83,463
- మొత్తం టీకాలు: 150.06 కోట్ల డోసులు
Also Read: ఏపీలో కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 839 కోవిడ్ కేసులు, ఇద్దరు మృతి