IAS Officers: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు - HMDA జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాళి బాధ్యతలు
Amrapali IAS: ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాళి నేడు (డిసెంబర్ 15) హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
Telangana News: తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు తాజాగా పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరిలో మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ తొప్పో, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి. శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి. గౌతమి, జనగామ అడిషనల్ కలెక్టర్‌గా పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదిరవన్, వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్ లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాళి నేడు (డిసెంబర్ 15) హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమ్రపాలికి హెచ్‌ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్‌తో పాటు హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ ఆమ్రపాళి బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.