(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఖర్చు ఎంతో తెలుసా? ఈ జిల్లాలో అత్యధికంగా వ్యయం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రణాళికా శాఖ ద్వారా విడుదల చేసిన మొత్తం 105 కోట్లు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందుకు భారీగానే నిధులు ఖర్చు పెట్టారని ప్రచారం ఉంది. అయితే, ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలు, ఖర్చుల వివరాలను తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు ప్రణాళికా శాఖ సంయుక్త సంచాలకులు కె. రవిందర్ జిల్లాల వారీగా కేటాయించిన నిధుల వివరాలను అందజేసినట్లుగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు పల్నాటి రాజేంద్ర తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రణాళికా శాఖ ద్వారా విడుదల చేసిన మొత్తం 105 కోట్లు అని తెలిపారు.
జిల్లాల వారీగా కేటాయింపులు ఇవీ
ఆదిలాబాద్ - 338 లక్షలు
కొమ్రభీం - 254 లక్షలు
మంచిర్యాల - 270 లక్షలు
నిర్మల్ - 314 లక్షలు
ఖమ్మం - 481 లక్షలు
భద్రాద్రి కొత్తగూడెం - 368 లక్షలు
కరీంనగర్ - 312 లక్షలు
జగిత్యాల - 307 లక్షలు
పెద్దపల్లి - 240లక్షలు
రాజన్న సిరిసిల్ల - 216 లక్షలు
హన్మకొండ - 195 లక్షలు
వరంగల్ - 260 లక్షలు
జనగాం - 245 లక్షలు
భూపాలపల్లి - 170 లక్షలు
ములుగు - 127 లక్షలు
మహబూబాద్ - 322 లక్షలు
మహబూబ్ నగర్ - 337 లక్షలు
నారాయణపేట - 256 లక్షలు
గద్వాల్ - 282 లక్షలు
నాగర్ కర్నూల్ - 446 లక్షలు
వనపర్తి - 230 లక్షలు
నిజామాబాద్ - 435 లక్షలు
కామారెడ్డి - 408 లక్షలు
రంగారెడ్డి - 502 లక్షలు
మేడ్చల్ - 186 లక్షలు
వికారాబాద్ - 418 లక్షలు
మెదక్ - 316 లక్షలు
సంగారెడ్డి - 506 లక్షలు
సిద్దిపేట - 442 లక్షలు
సూర్యాపేట - 372 లక్షలు
భువనగిరి - 328 లక్షలు
హైదరాబాద్ జిల్లా ఖర్చుల సమాచారం మాత్రం ఇవ్వలేదు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 617 లక్షలు ఖర్చు పెట్టగా, అతి తక్కువ ఖర్చు ములుగు జిల్లాలో 127 లక్షలు మాత్రమే పెట్టారని ప్రభుత్వం ఇచ్చిన సమాచారం హక్కు చట్టం సమాచారంలో వివరించారు.