అన్వేషించండి

Osmania Hospital: తొలగిన సందిగ్ధత-ఉస్మానియా ఆస్పత్రిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఓజీహెచ్  భవనాన్ని కూల్చివేసి కొత్త భననాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఓజీహెచ్  భవనాన్ని కూల్చివేసి కొత్త భననాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి పాత భవనాలు కూల్చివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.  జులై 27న సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తుతం ఉన్న భవనం ఆసుపత్రికి పనికిరాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్త భవనాలకు 35.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం అవుతుందని, కొత్త OGH భవనం నిర్మాణం కోసం ఇతర నిర్మాణాలను కూల్చివేసే ప్రణాళికను వెల్లడించింది. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆరోగ్య శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ, ఎంఏ అండ్‌ యూడీ, ఆర్‌ అండ్‌ బీ, ఓజీహెచ్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో గత ఎనిమిదేళ్లుగా ఓజీహెచ్‌ నిర్మాణంపై ఉన్న గందరగోళానికి ప్రభుత్వం ముగింపు పలికింది.

ప్రస్తుత భవనం శ్రేయష్కరం కాదు
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం సురక్షితం కాదని, ఎటువంటి పరిస్థితుల్లో భవనం కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారో కారణాలను తెలిపింది.  పాత భవనం ఎలాంటి రోగుల సంరక్షణకు పనికిరానిది, 35.76 లక్షల చదరపు అడుగుల ప్రత్యామ్నాయ ఆసుపత్రి అభివృద్ధికి ఉప భవనాలతో ఓజీహెచ్ భవనాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొంది. శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించిడంతో ప్రస్తుతం ఓజీహెచ్‌లో పడకల సంఖ్య 1,100లకు పడిపోయింది.  ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, పరిస్థితుల ప్రకారం ఆస్పత్రికి 1,812 పడకలు అవసరమని OGH సూపరింటెండెంట్ డాక్టర్ B. నాగేందర్ తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రి భవనం వివాదం
1919లో హైదరాబాద్‌ చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌  ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని నిర్మించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలై 23న సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిని సందర్శించి రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. భవనాన్ని కూల్చివేసి రూ.200 కోట్లతో ఆధునిక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనలో వివాదం మొదలైంది. సీఎం నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక పిటిషన్లు, PIL లు దాఖలయ్యాయి. కొద్ది రోజులకు డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైకోర్టును ఆశ్రయించింది. 2010 నవంబర్ 3న జారీ చేసిన GO 313లో పేర్కొన్న విధంగా ప్రస్తుత నిర్మాణాలకు మరమ్మతులు చేయాలని, కొత్త భవనాలను నిర్మించాలని కోరింది.  

అంతకు ముందు ఉస్మానియా భవనాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం జేఎన్‌టీయూ నిపుణులతో కమిటీ వేసింది. బాగు చేసినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండబోదని నిపుణుల బృందం చెప్పడంతో కూల్చివేతకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే జేఎన్టీయూ నివేదికను ఇంటాక్ (భారతదేశం చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేసే ట్రస్ట్) తప్పు పట్టింది. ఇంటాక్ తమ ఇంజినీర్లను దిల్లీ నుంచి పిలిపించి మూడు రోజులు అధ్యయనం చేసింది. భవనం బలంగా, భద్రంగా ఉందని చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పైపైన దెబ్బతిన్నట్లు పేర్కొంది. ప్లాస్టరింగ్ పనులు చేసి అన్ని ఆధునిక సౌకర్యాలూ కల్పించవచ్చన్నారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కొత్త భవనాలు కూడా కట్టవచ్చొన్ని ఇంటాక్ ఇంజినీర్లు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget