అన్వేషించండి

Committee on Dharani: ధరణిపై ఐదుగురు సభ్యులతో కమిటీ - భూముల్లో అవకతవకలపై ఫోకస్‌

ధరణి పోర్టల్‌పై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ధరణిలో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది.

Committee on Dharani Portal: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణిలో భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసింది. ధరణి  పోర్టల్‌(Dharani Portal)లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా... ఐదుగురు సభ్యులతో కమిటీ(Five Member Committee)ని నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పేరుతో భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అవకతవకలను కూడా వెలికితీయనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

ధరణిపై వేసిన కమిటీలో కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌... నవీన్‌ మిత్తల్‌(Naveen Mittal) కన్వీనర్‌గా బాధ్యతలు  నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి(M. Kodanda Reddy), మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన  కమిషనర్‌గా పని చేసిన రేమండ్‌ పీటర్‌(Raymond Peter)ను ఈ కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ న్యాయ  విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్(Sunil)‌, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌(B. Madhusudan)ను  కూడా ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ... ధరణి పోర్టల్లోని సమస్యలను గుర్తించి.. వారికి పరిష్కారాలను కనుగొని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. వీలైనంత  త్వరగా ఈ నివేదిక ఇవ్వాలని.. కమిటీని ఆదేశించింది రేవంత్‌రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కమిటీ పనిచేయనుంది.

ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములు దోచుకుందని కాంగ్రెస్‌ (Congress) పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే... ధరణిని బంగాళాఖాతం వేస్తామని  పదేపదే ప్రకటించింది. అంతేకాదు... ధరణి స్థానంలో భూమాత(Bhoomatha)ను తీసుకొస్తామని కూడా ఎన్నికల ముందు ప్రకటించింది కాంగ్రెస్‌. ఈ క్రమంలో ముందుగా  ధరణిలో సమస్యలను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పేరుకుపోయన భూ సమస్యలకు కారణమైన పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేస్తే తప్ప పరిష్కారం  సాధ్యం కాదని, రెవెన్యూ అకారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉన్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్‌లో  సమస్యలను తొలగించి సరికొత్తగా రూపొందించాలని నిర్ణయించింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఈ దిశగా ఐదుగురు సభ్యుల కమిటీ పనిచేయనుంది. కమిటీ ఇచ్చే నివేదిక  ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

2020 అక్టోబరు 29న ధరణిని ప్రారంభించింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల  ఖాతాలు ఉన్న వారికే పట్టా పాసు పుస్తకాల జారీ చేస్తున్నారు. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.  ధరణి పోర్టల్‌తో లక్షల్లో పెండింగ్  సమస్యలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్‌ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీకి అప్పగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. కొత్త  సమస్యలు తలెత్తకుండా... ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుకోవడంలో భాగంగానే ఈ కమిటీని ప్రభుత్వం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 33  మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా... భూముల సమస్యలు పరిష్కారం కాలేదు. అందుకే భూమాత పోర్టల్ తీసుకురావడానికి ముందే... ఉన్న సమస్యలకు పరిష్కరించి..  అవి మళ్లీ తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

ప్రభుత్వం నియమించిన ఈ ఐదుగురు సభ్యుల కమిటీ జిల్లాల్లో పర్యటించి.. భూ సమస్యలపై అధ్యయనం చేయనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి  స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుగొని... వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని  ప్రభుత్వం ఆదేశించింది.

టాప్ హెడ్ లైన్స్

Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget