News
News
X

Abhishek Mohanty : వివేకా హత్య కేసు సిట్‌ అధికారికి రిలీఫ్‌ - విధుల్లోకి తీసుకున్న తెలంగాణ!

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అభిషేక్ మహంతిని సర్వీస్‌లోకి తీసుకుంది. కోర్టు ధిక్కరణ అవకాశాలు ఉండటంతో హడావుడిగా జీవో జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 

ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మొహంతిని  ( Abhishek Mahanty ) తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు విధుల్లోకి తీసుకుంది. తనను సర్వీస్ లోకి తీసుకోవాలని దాదాపుగా ఏడు నెలలుగా ఆయన సెంట్రల్ అడ్మినేస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌తో ( CAT ) పాటు హైకోర్టులోనూ పిటిషన్లు వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికి సర్వీసులోకి తీసుకుంటున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ( TRS Governament ) జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్ సోమేష్ కుమార్ ( CS Somesh Kumar ) హైకోర్టుకు తెలిపారు. అభిషేక్ మహంతి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ క్యాడర్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఏపీకి కేటాయించారు. 

స్పీకర్ నిర్ణయంపై ట్రిపుల్ ఆర్ అసంతృప్తి, జనం నవ్వుకొనే రోజు వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక

2014 నుంచి 2021 వరకూ ఆయన ఏపీలోనే( AP )  పని చేశారు. అయితే తాను విభజన సమయంలో తెలంగాణ ఆప్షన్ ( Telangana ) ఇచ్చినప్పటికీ ఏపీకి కేటాయించారని..  తనకు తెలంగాణ క్యాడరే కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం విధుల్లోకి తీసుకునేందుకు నిరాకరించింది.  ఆయన ఏడు నెలలుగా జీతం లేకుండా అటు ఏపీకి కాకుండా.. ఇటు తెలంగాణకు కాకుండా ఉండిపోయారు. ఈ అంశంపై క్యాట్ పలుమార్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి క్యాట్ ఆదేశించినా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టులో ( TS High Court ) వేశారు అభిషేక్ మహంతి. 

బీజేపీ డబుల్ ఇంజన్ గ్రోత్‌ నినాదానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్‌, పిగ్మీలు అంటూ సెటైర్లు

కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉండటంతో సర్వీస్ లోకి తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ( TS Governament ) జీవో జారీ చేసి విషయాన్ని హైకోర్టుకు తెలియచేసినట్లుగా భావిస్తున్నారు . ఏపీలో అభిషేక్ మహంతి పలు జిల్లాలకు ఎస్పీగా విధులు నిర్వహించారు. 2018 అక్టోబర్‌లో ఆయనను కడప జిల్లా ఎస్పీగా నియమించారు. ఆయన ఎస్పీగా ఉన్నప్పుడే్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసింది. వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ఏర్పాటయిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్‌లో కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన క్యాడర్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అభిషేక్ మహంతి తండ్రి ఏకే మహంతి ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా కూడా పని చేశారు.  

Published at : 15 Mar 2022 06:41 PM (IST) Tags: CS Somesh Kumar Abhishek Mahanti AP Cadre IPS Telangana Cadre IPS Abhishek

సంబంధిత కథనాలు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!

రద్దయిన పాత నోట్లను కొత్తగా మార్చే స్వామిజీ!

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు

Nizamabad News: అన్నదాతను ఆగం చేస్తున్న వర్షం- నేలకొరిగిన పంటలు

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

BRS Party: ఢిల్లీలో ఆ బిల్డింగ్‌ నుంచే BRS కార్యకలాపాలు? త్వరలోనే అక్కడా తెలంగాణ భవన్!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!