Telangana Elections 2023: ఈసారి ఎన్నికల్లో గెలిస్తే గిరిజన బంధు - మంత్రి హరీష్ రావు ప్రకటన
Telangana Polls 2023: తెలంగాణకు విశ్వ ఖ్యాతి వచ్చింది కేసీఆర్ వల్లే అన్నారు హరీష్ రావు. ఇదే అభివృద్ధి కొనసాగాలి అంటే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు.
Telangana Minister Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), మంత్రులు ఓట్ల కోసం కీలక హామీలు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే గిరిజన బంధు ఇస్తామని మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రకటించారు. పాలకుర్తిలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకు విశ్వ ఖ్యాతి వచ్చింది కేసీఆర్ వల్లే అన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు అధికారం లోకి వస్తే ఢిల్లీ కేంద్రంగా పరిపాలన సాగుతుందన్నారు.
బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పార్టీలని ప్రజలు ఇది గుర్తుంచుకోవాలన్నారు. సిద్దిపేట ప్రజలు మాకు ఓటర్లు కాదు.. మా కుటుంబం సభ్యులు అన్నారు హరీష్ రావు. సిద్దిపేట ప్రజలే కుటుంబంగా నిత్యం అందుబాటులో ఉండి, అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి చేస్తున్న పార్టీని ఆశీర్వదించాలన్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సిద్దిపేటలో హరీష్ రావు సతీమణి ఇంటింటి ప్రచారం..
బోటిక్స్ నడుపుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో పర్యటించానని మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత అన్నారు. అప్పుడు తెలంగాణ అంటే ఎవరు గుర్తుపట్టేవారు కాదని... ఆంధ్ర, హైదరాబాద్ అంటేనే గుర్తుపట్టేవారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సాధించిన తర్వాతే తెలంగాణ పేరును ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఆగిపోకూడదు అంటే మరోసారి బీఆర్ఎస్ నే గెలిపించాలని ఓటర్లను శ్రీనిత కోరారు. వేరే పార్టీకి అధికారం ఇస్తే ఢిల్లీ కేంద్రంగా పరిపాలన కొనసాగుతుందని.. దీంతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు.
సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో శ్రీనిత పలువురు కౌన్సిలర్ లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన శ్రీనిత రావుకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా శ్రీనితా రావు బీడీ కార్మికురాలితో ముచ్చటిస్తూ సరదాగా బీడీలు చుట్టారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ కవితతో కలిసి ఆమె మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనే మొదటి స్థానంలో నిలిపిన హరీష్ రావుకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలన్నారు. గత ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు రికార్డు మెజార్టీ వచ్చిందని... ఈ ఎన్నికల్లో మెజార్టీ మరింత పెంచి ఒక లక్ష 51 వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదు - బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న రేవంత్ !