అన్వేషించండి

Telangana Elections 2023 : మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదు - బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న రేవంత్ !

Telangana Elections 2023 : ఓట్లు చీల్చి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఐటీ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పుతోందన్నారు.


Telangana Elections 2023 Revant Reddy :    మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా సీఈఓ స్పందించలేదన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదని .. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 

రైతు బంధు నిధుల జమకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ బంధం మరోసారి బయటపడిందని   రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీది ఫెవికాల్ బంధం బలపడిందని రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ కు సహకరించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చేలా బీజేపీనే చేసిందని ఆరోపించారు.  కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుని పోలింగ్ కు 4 రోజుల ముందు రైతుబంధు డబ్బులు వేస్తున్నారని, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని బీఆర్ఎస్ చూస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే జనవరిలో రైతుబంధు వేస్తామని ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారన్నారు. బీఆర్ఎస్ వేస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని విజ్ఞప్తి చేశారు.  

ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కో కేసీఆర్ భావిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ పంచుకొని ఆస్తులు పంచుకున్నారన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని రేవంత్ విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌కి పడే ఓట్లను చీల్చడానికి బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ పై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారని.. అయితే వారంతా బీజేపీలో ఉంటే మంచివారు లేదంటే రావణాసురులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రజాదర్బార్ పెడతాడో, జనతా బార్ పెడతాడో వాళ్ళకే తెలియాలన్నారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని రేవంత్ పేర్కొన్నారు.  
 
కేసీఆర్ ఓటుకు పదివేలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధుకు అనుమతి తెచ్చుకున్న వాళ్ళు దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఎన్నికల్లో మా పోటీ ఈడీ, ఐటీ తోనే ఉంది. కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు, గోయల్ ఇంటిపై దాడి, రైతుబంధు విషయంలో మోదీ, కేసీఆర్ స్నేహం స్పష్టంగా అర్థం అవుతోందని రేవంత్ విమర్శించారు.  వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు లేవు. బీజేపీలో ఉన్నప్పుడు రాముడిగా కనిపించిన వివేక్.. కాంగ్రెస్‌లోకి రాగానే రావణసూరుడిగా మారాడు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాడు కాబట్టే పొంగులేటిపై దాడులతో హింసిస్తున్నారని మండిపడ్డారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget