Telangana Elections 2023 : గ్యారంటీలకు గాంధీలు - క్షమాపణలకు బంట్రోతులా ? కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం !
తెలంగాణ విషయంలో గాంధీ కుటుంబం క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా అని ఆమె ప్రశ్నించారు.
Telangana Elections 2023 Kavitha : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్సేనన్నట్లుగా గాంధీభవన్ లో చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పారు. ఈ అంశంపై కవిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు.
క్షమాపణలకు బంట్రోతుల్ని పంపుతారా ?
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా???! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!. ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందుర మోకరిల్లాలి !
సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు అని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు.
గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 17, 2023
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా?
పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ… pic.twitter.com/N4bni4z4qU
చిదంబరం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ ఏర్పాటుపై చిదంబరం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిదంబరం తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని హరీష్ రావు అన్నారు. నాడు తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దానిని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారని దు విమర్శించారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.