By: ABP Desam | Updated at : 13 Dec 2021 03:02 PM (IST)
వీహెచ్ (ఫైల్ ఫోటో)
తమిళనాడులో కొద్ది రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవానుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు జవాను మరణంపై రాజకీయ నేతలు, మంత్రుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అమరజవాను సాయి తేజకు నివాళులు అర్పించిన తీరుపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమర జవాన్ సాయి తేజకు నివాళులు అర్పించడానికి ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం పట్ల తాను బాధపడుతున్నానని వి. హనుమంతరావు అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అయ్యప్ప మాలలో ఉంటే.. ఇతర మంత్రులు వెళ్లవచ్చు కదా అని ప్రశ్నించారు. అసలు ఏపీ సీఎం జగన్ ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ వీహెచ్ నిలదీశారు. సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో పీవీ సింధు, సానియా మీర్జాకు కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఈ అమర జవాన్ కుటుంబానికి ఇవ్వరా అని ప్రశ్నించారు. అసలు సాయి తేజ సాటి తెలుగు వాడని కూడా కేసీఆర్ గౌరవించరా అని వీహెచ్ నిలదీశారు.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తూ చనిపోయిన 700 మంది రైతులకు కేసీఆర్ పరిహారం ఇస్తానన్నారని.. ఇలాంటి దేశ భక్తులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంటికి వస్తే కౌగలించుకునే కేసీఆర్.. సైనికుడి విషయంలో అనుసరించే విధానం ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. సాయి తేజ కుటుంబం నుంచి దేశం కోసం ఇద్దరు కొడుకులను పంపించారని గుర్తు చేశారు. మరి ఇలాంటి విషయంలో జవాన్లను ప్రభుత్వం గౌరవిస్తేనే దేశ యువతకు మంచి సందేశం అందుతుందని తెలిపారు. కాబట్టి, మనం, మన ప్రభుత్వాలు అమర సైనికులను గౌరవించుకోవాలని వి. హనుమంతరావు పిలుపు ఇచ్చారు.
తమిళనాడులో నీలగిరి పర్వతాల్లో డిసెంబరు 8న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో లాన్స్ నాయక్ గ్రేడ్‌కు చెందిన, చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను కూడా ఉన్నారు. సాయి తేజ అంత్యక్రియలు ఆదివారం (డిసెంబరు 12) జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మీరు పెట్ లవర్సా ? - పెటెక్స్ విశేషాలు ఇవిగో
TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !
Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
TS High Court: గవర్నర్ Vs సర్కార్: ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ అంగీకరించిన హైకోర్టు - CJ కీలక వ్యాఖ్యలు
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్