News
News
X

Siddipet Army Jawan: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన

నవంబరు 16న జవాను 20 రోజుల పాటు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఓ ఆర్మీ జవాను ఉత్తరాదిలో కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని భాటిండా సమీపంలో ఫరీద్ కోట్‌లో తన విధులకు డిసెంబరు 7వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అప్పటి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది. తెలంగాణలో సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపల్లి చెందిన బి. సాయి కిరణ్ రెడ్డి అనే ఆర్మీ జవాను ఇంటి నుంచి విధులకు వచ్చే క్రమంలో కనిపించకుండా పోయారు. అంతకుముందు నవంబరు 16న ఆయన 20 రోజుల పాటు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది.

చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్ తండ్రి పటేల్ రెడ్డి నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తన కుమారుడు పంజాబ్‌లో విధులకు హాజరయ్యేందుకు డిసెంబరు 5న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరాడని తెలిపారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కాడని పేర్కొన్నారు. కానీ, డిసెంబరు 6, డిసెంబరు 7 తేదీల్లో ఆయన నుంచి ఏ సమాధానమూ రాలేదని పేర్కొన్నాడు. కనీసం ఫోన్ కూడా కలవని పరిస్థితి నెలకొందని వెల్లడించాడు. 

జవాను కనిపించకుండా పోవడంతో సిద్దిపేటలోని అతని ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంజాబ్ ఫరీద్ కోట్‌లో సాయి కిరణ్ హాజరు కాలేదని ఆర్మీ కెప్టెన్ ఫోన్ చేసి తండ్రి పటేల్ రెడ్డి చెప్పారు. దీంతో ఆందోళన మరింత తీవ్రమైంది. 

ఈ క్రమంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. సాయి కిరణ్ డిసెంబరు 6 సాయంత్రం ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చినట్లు తేల్చారు. దీంతో ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని సాయి కిరణ్ కుటుంబానికి తెలియజేశారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులు సాయి కిరణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 13 Dec 2021 01:26 PM (IST) Tags: Army Jawan Sai Kiran Reddy Jawan Missing in Punjab Siddipet Jawan Missing Telangana Jawan Missing in Punjab

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: గవర్నర్‌ వివాదంపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు

Breaking News Live Telugu Updates: గవర్నర్‌ వివాదంపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

మీరు పెట్ లవర్సా ? - పెటెక్స్ విశేషాలు ఇవిగో

మీరు పెట్ లవర్సా ?  - పెటెక్స్ విశేషాలు ఇవిగో

TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !

TS Secretariat : తుది దశకు తెలంగాణ కొత్త సచివాలయం పనులు - ఫిబ్రవరి 17న ఓపెనింగ్‌కు ముస్తాబు !

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!

టాప్ స్టోరీస్

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

కృష్ణా  జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ-  ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?