Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ - ఇంచార్జ్ మీనాక్షి ఫోటో లేకుండా ప్రకటనలు
Congress In Charge: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోటో లేకుండా పేపర్ ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది. ఆమెను అవమానించడమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Meenakshi Natarajan Photo Missing : తెలంగాణ కాంగ్రెస్ లో తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ చిన్న వివాదాలే పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు మీనాక్షి నటరాజన్‌ను విమర్శించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్ర పర్యటన సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రె పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. అన్ని ప్రముఖ దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చినప్పటికీ అందులో ఎక్కడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోటో కనిపించలేదు.
మరో మంత్రి వివేకన తన సొంత వెలుగు పత్రికలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం మీనాక్షి నటరాజన్ ఫోటో ఉంది. మంత్రి పొంగులేటి వర్సెస్ ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సాక్షిగా మీనాక్షికి అవమానం జరిగిందని ఫిర్యాదులు చేస్తున్నారు. పొంగులేటి తీరుతో కాంగ్రెస్ లో అసంతృప్తి రేగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలే మీనాక్షి, మంత్రి పొంగులేటికి క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. పొంగులేటిని కట్టడి చేస్తుందన్న అక్కసుతోనే మీనాక్షి నటరాజన్ ను అవమానించారని కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జినే అవమానిస్తారా అంటూ మంత్రి పొంగులేటిపై సీనియర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖర్గే దృష్టికి పంచాయతీని తీసుకెళ్లారని అంటున్నారు.
మంత్రి పొగంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ప్రకటనలు పార్టీ తరపునే ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఇచ్చినవి కావు. ప్రభుత్వంలో ఆమెకు ఎలాంటి పదవి లేదు కాబట్టి ఇవ్వలేదని సమర్థించుకోవడావికి కూడా లేదు. పార్టీ తరపున ప్రకటనలు ఇచ్చి.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ను మర్చిపోవడం అసాధారణం అని.. ఇది యాధృచ్చికంగా జరిగింది కాదని కాంగ్రెస్ వర్గాలు నమ్ముతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇతర కాంగ్రెస్ నేతలు, ఎణ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఈ క్రమంలోనే పొంగులేటిపై అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.
అయితే పొంగులేటి వర్గీయులు మాత్రం ప్రకటన ఇవ్వడం వరకు పొంగులేటి చూసుకుంటారు కానీ.. అందులో ఎవరెవరి ఫోటోలు ఉండాలి.. డిజైన్ ఎలా ఉండాలన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ సెల్ చూసుకుంటుందని.. పొంగులేటి స్పాన్సర్ చేసినంత మాత్రాన్.. అధి పొంగులేటి ఇచ్చినట్లుగా ఎందుకు అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కేవలం మంత్రిని టార్గెట్ చేయడానికి కొన్ని వర్గాలు ఇలా ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. ఈ అంశాన్ని ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలా తీసుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
అదే సమయంలో మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఫ్లెక్సీలు కట్టడం అన్నా, భారీగా పేపర్లలో ప్రకటనలు ఇచ్చి చూపించే విధేయత అన్నా ఆమెకు ఇష్టం ఉండదని.. ఆ విషయం తెలిసే.. ఇలా ప్రకటనలు ఇచ్చారని అంటున్నారు.





















