Dalita Dandora Live Updates: టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతా.. దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో కాంగ్రెస్ దళిత దండోరా సభ..
LIVE
Background
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత దండోరాను నిర్వహించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లాలో మరో దళిత దండోరా సభ పెట్టబోతున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అప్పుడే ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభలోనే ఈ విషయాన్ని చెప్పారు. కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని.. ఈ సభ నాయకుల విజయం కాదని... కార్యకర్తల కమిట్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగింది
సోనియా గాంధీ నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల రోజుల నుంచి ఆగం ఆగం అవుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు, కాదని.. విద్య ఉపాధి కావాలని రేవంత్ అన్నారు. 10 లక్షలు దేనికి సరిపోతాయని అడిగారు.
టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతాం: రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లిలో ఓ అడుగు వేశాం.. ఇంకో అడుగు ర్యాలిలో వేశాం.. ఇంకో అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుతాం. టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాడనికి వరుణుడు వచ్చాడని రేవంత్ రెడ్డి అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా మెుత్తం తీసి కేసీఆర్ కు పంపించండి.. నిఖార్సైన కార్యకర్తలు వానలో కూడా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదు: బట్టి
తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదని బట్టి విక్రమార్క అన్నారు. ఏడేళ్ల క్రితం తీసుకొచ్చిన ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ సర్కార్ ఖర్చు చేయలేదని బట్టి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దళిత వ్యతిరేక విధానలపై పెద్ద ఎత్తున పోరాడాలన్నారు.
రావిర్యాలలో వర్షం
రావిర్యాలలో వర్షం పడుతుంది. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దే వేచి ఉన్నారు. మరోవైపు నేతలు సభలో మాట్లాడుతున్నారు.
రావిర్యాలలో వర్షం
రావిర్యాలలో వర్షం పడుతుంది. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దే వేచి ఉన్నారు. మరోవైపు నేతలు సభలో మాట్లాడుతున్నారు.