అన్వేషించండి

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?

Telangana Congress: టీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 15వ తేదీ తర్వాత జాబితాను విడుదల చేయనున్నట్లు మురళీధరన్ స్పష్టం చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 15 తర్వాత టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 70 సీట్లపై ఇవాళ చర్చ జరిగిందని,  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అవుతుందని తెలిపారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. కాంగ్రెస్‌లోకి చాలామంది వస్తున్నారని, ఒకరిద్దరు వెళ్లిపోయినా తాము బాధపడమని మురళీధరన్ తెలిపారు.

వెళ్లిపోయే వాళ్లపై తాము స్పందించమని, పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై తమ పార్టీ వాళ్లు మాట్లాడరని మురళీధరన్ చెప్పారు. లిస్ట్ ఇంకా రాకముందే పొన్నాల ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని, ఇప్పటివరకు 70 సీట్లతో జాబితా సిద్దంగా ఉందని అన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ త్వరలో మరోసారి సమావేశమై మిగిలిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల అనంతరం పూర్తి జాబితా ఒకేసారి ప్రకటిస్తామని అన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మైనార్టీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని మరళీధరన్ పేర్కొన్నారు.

బస్సు యాత్రకు ముందు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, వామపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థుల జాబితా ఉంటుందని మురళీధరన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైంది. ఈ మీటింగ్‌లో 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. వివిధ సర్వే రిపోర్టులు, సామాజిక అంశాల ఆధారంగా టికెట్లను కేటాయించడంపై చర్చలు జరిపింది. అటు పొత్తులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వామపక్షాలను కలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ వామపక్షాలతో పొత్తు వద్దని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేపు ఉభయ కమ్యూనిస్టు నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అనంతరం పొత్తుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కలిసి తీర్మానం చేసుకున్నాయి. దీంతో ఆ పార్టీలకు మిర్యాలగూడ, మునుగోడు, కొత్తగూడెం, భద్రాచలం టికెట్లను కాంగ్రెస్ కన్ఫామ్ చేసినట్లు ఇటీవల జోరుగా వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను వామపక్ష నేతలు పూర్తిగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఇంకా కుదరలేదని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో వామపక్ష పార్టీలు కలిశాయి. దీంతో రాష్ట్రంలో కూడా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ కొంతమంది నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో రేపు వేణుగోపాల్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత తెలంగాణలో పొత్తులపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో దాదాపు 10 స్థానాల్లో వామపక్షాలకు బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఆ పార్టీలతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో లాభం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget