అన్వేషించండి

Family Digital Card: ఒకే డిజిటల్ కార్డులో అన్ని రకాల సేవలు - ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana News: తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టును అధికారులు చేపట్టనున్నారు. అయితే, కుటుంబం ఫోటో దిగడం ఆప్షన్‌గా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Family Digital Cards As Pilot Project In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు (Family Digital Cards) సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్డుల‌ జారీకి సంబంధించి 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయిలో పైలెట్ ప్రాజెక్టుగా చేప‌ట్ట‌నున్న ప‌రిశీల‌న స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి ఆయన రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక ప‌ట్ట‌ణ‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని, పూర్తిగా ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంత‌మైతే రెండు వార్డులు/ డివిజ‌న్లు, పూర్తిగా గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ‌మైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల‌ని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్ట‌నున్న గ్రామాలు, వార్డులు/  డివిజ‌న్ల ఎంపిక పూర్త‌ైంద‌ని తెలిపారు.

అక్టోబర్ 3 నుంచి

పైలెట్ ప్రాజెక్టును (Pilot Project) అక్టోబ‌రు 3వ తేదీ నుంచి 7వ తేదీ వ‌ర‌కు 5 రోజుల పాటు చేప‌డ‌తామ‌ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే, కుటుంబ స‌భ్యులంతా స‌మ్మ‌తిస్తేనే ఆ కుటుంబం ఫొటో తీయాల‌ని, అదో అప్ష‌న‌ల్‌గా ఉండాల‌ని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ సమ్మతి లేకుంటే ఆ ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌కు సంబంధించి ఉమ్మ‌డి జిల్లాల‌కు ఉన్న నోడ‌ల్ అధికారులు క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయాల‌ని.. అప్పుడే ప‌క‌డ్బందీగా కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఒకే కార్డులో అన్నీ సేవలు

ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న రేష‌న్ కార్డు, పింఛ‌ను - స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్ప‌టికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌ైంద‌ని అధికారులు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దాన్ని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను జ‌త చేయ‌డం, మృతి చెందిన వారిని తొల‌గించ‌డం చేస్తామ‌ని చెప్పారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులు చేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పైలెట్ ప్రాజెక్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సానుకూల‌త‌లు,  ఎదురైన ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని సూచించారు. కాగా, మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం ఇటీవల సమీక్షలో వెల్లడించారు. కార్డు వెనుకాల ఇతర కుటుంబ సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు.

ఆ నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను సరి చేసిన అనంత‌రం పూర్తి స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని సీఎం స్పష్టం చేశారు. స‌మీక్ష‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి,  రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Also Read: KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget