By: ABP Desam | Updated at : 29 Dec 2022 04:39 PM (IST)
తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్
Telangana Incharge DGP : తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆయనే డీజీపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేస్తూండటంతో అంజనీక కుమార్‌కు అవకాశం లభించింది. అంజనీరి కుమార్‌ను ఇంచార్జ్ డీజీపీగా నియమించడంతో కొంత మంది కీలక అధికారుల్ని బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా రవిగుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్‌ను నియమించారు. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, లా అండ్ ఆర్డర్ డీజీగా శాంతికుమార్ జైన్ ను నియమించారు.
యూపీఎస్సీ ఆమోదం తర్వాత అంజనీకుమార్ నే పూర్తి స్థాయి డీజీపీగా నియమించే చాన్స్
అంజనీకుమార్ ను ఇంచార్జ్ డీజీపీగానే నియమించారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకం కోసం సీనియారిటీ ప్రాతిపదికన ఐగుదుగురు ఉన్నతాధికారుల పేర్లతో జాబితా ఇప్పటికే యూపీఎస్సీ కి చేరింది. వారిలో ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్రానికి యూపీఎస్సీ సూచన చేయనుంది. వారిలో నుంచి ఒకరిని తెలంగాణ సర్కార్ ఎంచుకుంటుంది. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ , 1989 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రవిగుప్తా , 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ , అడిషనల్ డీజీ జితేందర్ , రాజీవ్ రతన్ పేర్లను యూపీఎస్సీకి పంపారు. యూపీఎస్సీ నుంచి షార్ట్ లిస్ట్ అయిన మూడు పేర్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీజీపీని నియమిస్తారు. అయితే అంజనీకుమార్ నే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్
అంజనీ కుమార్ ప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ సేవలను అందించారు. అందుకే ఆయన వైపే ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే డీజీపీ నియామకం కీలకంగా మారింది. ఈ అవకాశం అంజనీకుమార్‌కు లభించింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్ స్వస్థలం బీహార్.
మహేందర్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ పోస్టు ఇచ్చే అవకాశం
మరోవైపు పదవీ విరమణ చేయనున్న మహేందర్ రెడ్డికి మరో పోస్టు ఇచ్చేందుకు టీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి ఉన్నవారికి కేబినెట్ హోదా లభించనుంది. మహేందర్ రెడ్డి రిటైరైన తర్వాత ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది.
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!