BJP First List : బీజేపీ మొదటి జాబితా కోసం ఎదురు చూపులు - అభ్యర్థుల కోసం వెదుక్కుంటున్నారా?
బీజేపీ లిస్ట్ మరింతగా ఆలస్యం అవుతోంది. బలమైన అభ్యర్థుల కోసం ఇంకా జల్లెడ పడుతున్నారు.
BJP First List : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. ముగిసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే తెలంగాణ అభ్యర్థుల గురించి మత్రం ఎలాంటి సమాచారం లేదు. ఇదిగో అదిగో అని ప్రచారం చేస్తూనే ఉన్నారు కానీ జాబితా రిలీజ్ చేయకపోవడంతో బీజేపీ క్యాడర్ లో అయోమయం ఏర్పడింది.
అభ్యర్థుల ఎంపికలో వెనుకబడిన బీజేపీ
బీజేపీకి 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతుక్కోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. మొన్నటిదాకా బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనీ, ఒంటరిపోరుతో రాష్ట్రంలో సునామీ సృష్టించబోతున్నామని బీజేపీ నాయకత్వం చెబుతూ వస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో మంతనాల మీద మంతనాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమైన నేతలతో కూడిన తొలిజాబితా ఒకటెండ్రు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయని వారం రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. 20 నియోజకవర్గాలకు మించి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో జాతీయ నాయకత్వం మల్లగుల్లాలు పడుతూ అభ్యర్థుల ప్రకటనను తాత్సార్యం చేస్తోంది.
పార్టీలో చేరికలూ అంతంతమాత్రమే !
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ అసంతృప్తి నేతల్ని న తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది. కానీ చేరికలు అనుకున్నట్లుగా జరగడం లేదు. చేరికల కమిటీ చైర్మెన్‌గా ఈటల రాజేందర్, ఇనిప్లూయెన్స్ కమిటీ చైర్మెన్‌గా డీకే అరుణలాంటి కీలకమైన నేతలున్నప్పటికీ ఆ పార్టీలో పెద్దగా ప్రభావశీల నాయకులు చేరడం లేదు. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటన తర్వాత ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు.
'సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!' - వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్న నారా లోకేశ్
పదవులు ఇచ్చినా గుంభనంగా సీనియర్ నేతలు
ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 14 కమిటీలను వేసింది. ఆయా కమిటీలకు చైర్మెన్లుగా నియమించిన అసంతృప్త నేతలు తమ విధులను నిర్వర్తించడం లేదు. అసంతృప్తి బాటను వీడటం లేదు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతికి ఆందోళనా కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది. తాను పార్టీని వీడట్లేదని ఆమె చెబుతున్నప్పటికీ పార్టీ ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. ఆయా నియోజకవర్గాలకు పోటీచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి షార్ట్ లిస్టు తయారు చేసే బాధ్యత రాజగోపాల్‌రెడ్డికి అప్పగించినా ఆయన తన విధులను నిర్వర్తించడం లేదు. ఆయా కమిటీల చైర్మెన్లు ఎన్నికల నాటికి పార్టీలో ఎంత మంది ఉంటారో కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పలేని పరిస్థితిలో ఉంది.
'మాపై ఏదైనా కేసు ఉందా?' - ఎన్నికల వేళ రాజకీయ నేతల గుబులు, వివరాలివ్వాలని అభ్యర్థనలు
జనసేనతో పొత్తు పేరుతో కాలయాపన
జనసేనతో పొత్తు పెట్టుకుందామని రాష్ట్ర నేతలు సిఫారసు చేశారు. అయితేపవన్ కల్యాణ్ ముఫ్పైసీట్లు అడిగారు. దీనిపై ఢిల్లీలో కొంత చర్చ జరుగుతోంది. ఈ పేరుతో జాబితాను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు.