Telangana Assembly: వినాయక నిమజ్జనం తర్వాతే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
శాసనసభ సమావేశాలు ఈనెల మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయ సభలు సమావేశమవనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, కౌన్సిల్సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్ జారీపై సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గణేశ్ ఉత్సవాల తర్వాతే ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండటం వల్ల గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాకే సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన ఈ నెల నాలుగో వారంలో ఉభయసభల సమావేశాలు ప్రారంభమవనున్నాయి.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. దళితబంధుతో పాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దళితబంధుతో పాటు ఇతర అంశాలు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఆరు నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అవి సాధ్యపడలేదు.
శాసనమండలి స్థానాలపైనా.. కేసీఆర్ ఢీల్లి నుంచి వచ్చాక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఒకటి ఉంది. వర్షాకాల సమావేశాలలోపు కౌశిక్‌రెడ్డికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో నియామకం జరిగే వీలుందని సమాచారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శాసనసభ సమావేశాలలోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే ఛాన్స్ ఉంది. సమావేశాల నాటికి ఎన్నికలు జరగకపోతే ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి కొనసాగుతారు. వచ్చేఏడాది జనవరి 4వ తేదీకి స్థానిక సంస్థల కోటా స్థానాలు 12 ఖాళీ అవుతాయి.