Breaking News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటన
ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 9 రెండో శనివారం, 10 ఆదివారం, 17వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం 9 రోజులు దసరా సెలవులు. తిరిగి పాఠశాలలను 18వ తేదీన తెరుస్తారు.
కార్వీ కేసులో మరో అరెస్టు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడిదారుల షేర్లను 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సెబీకి సమాచారం ఇవ్వకుండా షేర్లు బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు రూ.1,500 కోట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రుణంగా తీసుకుంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ 9 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి, సీఈవో కృష్ణహరి, సీవోవో రాజీవ్ సింగ్‌తో పాటు కంపెనీ సెక్రటరీ శైలజను అరెస్టు చేశారు.





















