అన్వేషించండి

Teenmar Mallanna: ‘నీ వీపు నువ్వే పగలగొట్టుకున్నవు కేసీఆర్, వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నరు..’ బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకున్నారు. తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి, కండువా కప్పి మల్లన్నను పార్టీలోకి ఆహ్వానించారు.

జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు.

‘‘అమరవీరులతో మీ వీపులు పగలకొట్టిపిస్త. నాపై 38 కేసులు పెట్టినవ్. దీనివల్ల నువ్వు సాధించింది ఏం లేదు. నాపై అక్రమ కేసులు పెట్టి, పోలీసులే బయటకు పోయి కన్నీళ్లు పెట్టుకున్నరు. జడ్జిలు కూడా మదనపడ్డరు. అధికారం ఉందనే అహంకారంతో నాపై కక్ష సాధింపు చేస్తున్నవు. హుజూరాబాద్‌లో ఏమైంది? అక్కడ నీ వీపు నువ్వే పగలగొట్టుకున్నవు. నువ్వు ఏ ఐదెకరాలకాడ నీ జీవితం మొదలు పెట్టినవో.. మళ్లీ అక్కడికి తీసుకొస్తం. బీజేపీ ద్వారా నాకు ఇంకా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరికింది. ఇక బరాబర్ ప్రజల్లోకి వస్తం. తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టినందుకు నేను బాధ పడలే. నువ్వు జర్నలిజం కుతిక మీద కత్తి పెట్టినవ్. ప్రశ్నించే గొంతుల మీద కత్తిపెట్టినవు. ఉద్యమకారులను తొక్కేస్తున్నవ్. మైహోం సిమెంటు తెచ్చి నీ రాజకీయ సమాధి కట్టకపోతే నన్నడుగు.’’ 

Koo App
నేడు ఢిల్లీలోని బిజెపి జాతీయ కార్యాలయంలో ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు తీన్మార్‌ మల్లన్న గారు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ @tarunchughbjp గారు వారికి పార్టీ కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేయడం జరిగింది. - Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) 7 Dec 2021

Teenmar Mallanna: ‘నీ వీపు నువ్వే పగలగొట్టుకున్నవు కేసీఆర్, వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నరు..’ బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్తూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. కేసీఆర్ ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చా’’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. సమస్యలపై పోరాడే తీన్మార్ మల్లన్నను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని అన్నారు. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందేనని.. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న కలం ఎత్తారని అన్నారు. తెలంగాణ యువత రోజూ తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారని.. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోందని అన్నారు.

Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి

Also Read: TRS MPs : పార్లమెంట్ శీతాకాల సమావేశాల బహిష్కరణ.. టీఆర్ఎస్ అధికారిక ప్రకటన !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Embed widget