అన్వేషించండి

Telangana BJP : బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు - తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చేది లేదన్న తరుణ్ చుగ్ !

బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం లేదని తరుణ్ చుగ్ ప్రకటించారు.


Telangana BJP :  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ చుగ్ ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోను బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని అధ్యక్షుడ్ని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందన్నారు.బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనగా కొట్టిపడేశారు.                            

 నితీష్ నేతృత్వంలో విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారన్నారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. పై స్థాయిలో అంతా కలిసి పని చేస్తారని.. రాష్ట్రానికి వచ్చే సరికి విమర్శలు చేసుకుంటారన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ల సంస్కృతి ఇదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీ టీంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సి టీంలో కూడా కాంగ్రెస్ పార్టీనే పోటీ పడుతోందని తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని  తరుణ్ చుగ్ తెలిపారు.                      

అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయన్నారు. రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. ఇటీవల తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ను హైకమాండ్ వరుసగా రెండు, మూడు సార్లు ఢిల్లీ పిలిపించడంతో ఆయనను బీజేపీ చీఫ్ ను చేస్తారని.. బండి సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది.                        

అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వినిపించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గినట్లగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ కు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావొచ్చునని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారికి బండి సంజయ్ నే కొనసాగిస్తున్నామని స్పష్టమైన  సంకేతాల్ని ఇచ్చారు. ఇక ఆ పార్టీ సీనియర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి  .                                       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
iPhone Amazon Offer: ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
ఐఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ - రూ.40 వేలలోపే!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget