News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Watch Video: రియల్ సింగం, ఎస్ఐపై పెద్ద కత్తితో దాడి - చాకచక్యంగా తప్పించుకుని నిందితుడి ఆటకట్టించిన SI

SI Escaped From Knife Attack Watch Video: ఓ వ్యక్తి కారణంగా పట్టపగలే ఓ పోలీసుకు ప్రాణాల మీదకి వచ్చింది. కానీ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోని రియల్ హీరోగా నిలిచారు కేరళ పోలీస్.

FOLLOW US: 
Share:

ఏదైనా గొడవ జరిగినా, అనుకోని అపాయం ఎదురైనా వెంటనే మనం పోలీసులకు కాల్ చేస్తుంటాం. అలాంటిది ఓ వ్యక్తి కారణంగా పట్టపగలే ఓ పోలీసుకు ప్రాణాల మీదకి వచ్చింది. కానీ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోని రియల్ హీరోగా నిలిచారు కేరళ పోలీస్. ఈ ఘటనపై తెలంగాణ అడిషనల్ డీజీపీ, మహిళా ఐపీఎస్ స్వాతి లక్రా స్పందించారు. రియల్ హీరో అంటూ కేరళ ఎస్‌ఐని కొనియాడారు. ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
కేరళలోని నూరనాడు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన వాహనం జూన్ 12న సాయంత్రం పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోంది. ఎడప్పోన్, కాయంకులంకు వెళ్లే జంక్షన్ వద్దకు వచ్చిన పోలీసులు స్కూటీపై అనుమానంగా ఓ వ్యక్తి కనిపించడంతో ఆగారు. పోలీస్ వాహనం ఆపిన వెంటనే ఎస్‌ఐ కిందకి దిగాడు. ఎస్ఐ కోసమే ఎదురుచూస్తున్నట్లుగా బ్లూ షర్ట్ ధరించిన నిందితుడు పెద్ద కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుకోని సంఘటనతో ఒక్కసారిగా పోలీస్ షాకయ్యాడు. అంతలోనే తేరుకున్న ఎస్‌ఐ నిందితుడ్ని ప్రతిఘటించాడు. ఒకట్రెండు కత్తి వేట్లు చేతిపై పడినా ఆయన ఎక్కడా తగ్గలేదు. సుగ్ధన్‌ అనే వ్యక్తిని పట్టుకున్న ఆ పోలీస్ ఒడిసిపట్టుకొని కిందపడేశాడు. అతడి చేతిలోకి కత్తిని లాక్కుని, నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ప్లాన్ చేసి ఖాకీపైనే కత్తితో దాడి..
నిందితుడు సుగ్ధాన్‌ అతని సోదరుడికి ఆస్తి విషయంలో విభేదాలు ఉన్నాయి. ఈ కేసు పీఎస్‌కు చేరడంతో రాజీ చేసే ప్రయత్నం చేశారు ఎస్ఐ. పోలీసులు తన సోదరుడికి అనుకూల నిర్ణయం తీసుకున్నారని, అన్యాయం జరిగిందని పగతో రగిలిపోయాడు సుగ్ధాన్. ఎలాగైనా ఎస్సైని హతమార్చాలని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే గస్తీకి వెళ్తున్న పోలీస్ వాహనాన్ని ఫాలో అయ్యాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సుగ్ధాన్‌ను చూసి పోలీస్ వాహనం అలా ఆపారో లేదో.. నిందితుడు పెద్ద కత్తితో ఎస్‌ఐపై దాడి చేశాడు. చేతికి రక్తం కారుతున్నా ధైర్య సాహసాలు ప్రదర్శించారు. నిందితుడ్ని నేలపై పడేసి ఒడిసి పట్టుకున్నాడు. మిగతా పోలీసులు వచ్చి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో ఇది రికార్డైంది.

Also Read: Delhi News: డిన్నర్ పెట్టలేదని దిండుతో చంపేశాడు, డెడ్‌బాడీ పక్కనే నిద్రపోయాడు

Also Read: Srikakulam: పెళ్లి చేసుకున్న ఆనందంలో వధూవరులు, దారిలో ఊహించని ఘటన - రెండు గ్రామాల్లో షాక్!

Published at : 19 Jun 2022 02:00 PM (IST) Tags: Kerala Viral news Swati Lakra Kerala Sub Inspector Sub Inspector Kerala Police

ఇవి కూడా చూడండి

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Kishan Reddy: కేసీఆర్‌కి వత్తాసు పలికితే మంచోళ్లు లేదంటే చెడ్డోళ్లా, గవర్నర్‌ నిర్ణయం కరెక్టే - కిషన్‌రెడ్డి

Kishan Reddy: కేసీఆర్‌కి వత్తాసు పలికితే మంచోళ్లు లేదంటే చెడ్డోళ్లా, గవర్నర్‌ నిర్ణయం కరెక్టే - కిషన్‌రెడ్డి

KTR: మా వాదన వినిపించుకపోతే ప్రజా ఉద్యమం గ్యారంటీ - కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

KTR: మా వాదన వినిపించుకపోతే ప్రజా ఉద్యమం గ్యారంటీ - కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత