X

Suryapet: నిన్న మరదలు... నేడు బావ... సూర్యపేట లవ్ స్టోరీలో తీవ్ర విషాదం

మరదలు చనిపోయిందని బావ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తాను పురుగుల మందు తాగుతున్న వీడియో మొత్తం రికార్డు చేశాడు.

FOLLOW US: 

వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్న ప్రేమికుల ఆశలు ఆదిలోనే అడియాసలయ్యాయి. యువతి చనిపోయిందని, బాధ భరించలేని ప్రియుడు సైతం తనువు చాలించాడు. పురుగుల మందు కొనుక్కొని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ దాన్ని తాగేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ విషాదకర సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తాను పురుగుల మందు తాగుతున్న వీడియో మొత్తం రికార్డు చేశాడు. ఆ తర్వాత అతను కొన ఊపిరితో ఆస్పత్రి మంచంపై కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ వీడియోలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.

Also Read: Huzurabad Bypoll: ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్.. మళ్లీ ఆ తప్పు చేయకుండా ఈసీ జాగ్రత్తలు, టెన్షన్‌లో దీదీ!

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత గురువారం నాడు ప్రియురాలు మౌనిక ఆత్మహత్య చేసుకోగా.. ఆమె చనిపోయిన విషయాన్ని ప్రియుడు పవన్ తట్టుకోలేకపోయాడు. వీరిద్దరూ వరసకు బావా మరదళ్లు. ఆమె లేని లోటును భరించలేని యువకుడు మనస్తాపానికి లోనయ్యాడు. తాను కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. అదే క్రమంలో శుక్రవారం పురుగుల మందు కొనుగోలు చేసి తాగేశాడు. ఆత్మహత్యకు ముందు తన మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను పురుగుల మందు తాగడం మొత్తాన్ని వీడియో తీశాడు. 

Also Read: Sangareddy: ఇద్దరు పిల్లల్ని గొంతు పిసికి చంపిన తల్లి.. ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నం, ఎందుకంటే..

రెండు రోజుల్లో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే, ఈ బావా మరదళ్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని.. వీరు విషయం తమ ఇళ్లలో చెప్పడంతో వారు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే తొలుత మౌనిక ఆత్మహత్య చేసుకోగా.. అది తట్టుకోలేని పవన్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కచ్చితమైన కారణాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Hyderabad Lovers: హైదరాబాద్‌లో లవర్స్ కిడ్నాప్.. సినిమా తరహాలో ఘటన, అసలేం జరిగిందంటే..

Also Read: Petrol-Diesel Price, 7 August: ఏపీ, తెలంగాణలో ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరం.. వివిధ నగరాల్లో తాజా ధరలు ఇవీ..

Tags: Suryapet Lover suicide lover Selfie Video lovers suicide suryapet news

సంబంధిత కథనాలు

  ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు

  ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు

Breaking News Live: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం.. పీఆర్సీ సాధన సమితి

Breaking News Live: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం.. పీఆర్సీ సాధన సమితి

KTR Letter: కేంద్రానికి కేటీఆర్ లేఖ.. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

KTR Letter: కేంద్రానికి కేటీఆర్ లేఖ.. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

Minister Harish Rao: ప్రతి నియోజకవర్గానికి దళితబంధు.. ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలనే నిర్ణయం వారిదే

Minister Harish Rao: ప్రతి నియోజకవర్గానికి దళితబంధు.. ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలనే నిర్ణయం వారిదే

Minister Harish Rao: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు... రాష్ట్రంలో 56 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు... రాష్ట్రంలో 56 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. మంత్రి హరీశ్ రావు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!