Petrol-Diesel Price, 7 August: ఏపీ, తెలంగాణలో ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరం.. వివిధ నగరాల్లో తాజా ధరలు ఇవీ..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగా ఉంటోంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.105.98, డీజిల్ ధర రూ.98.08 వద్ద ఉంది.
దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. డీజిల్ రేట్ల విషయంలో కూడా ఇలాగే స్థిరత్వం కొనసాగుతోంది. ఆయా నగరాల్లో ఇంధన ధరల్లో వ్యత్యాసం ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా స్థిరంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లోనూ గత 20 రోజులకు పైగా ఒకేలా ధరలు ఉంటున్నాయి.
తెలంగాణలో ఆగస్టు 7న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా స్థిరంగా ఉంటోంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.105.98, డీజిల్ ధర రూ.98.08 వద్ద ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరల్లో 0.01 పైసల అతి స్వల్ప పెరుగుదల కనిపించింది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే ఉంది. గత నాలుగు రోజులుగా వరంగల్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపించడం లేదు. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.38 పైసలు పెరిగి రూ.99.70 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.16 పైసలు పెరిగి రూ.107.72 అయింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.21 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.107.92 గా ఉంది. డీజిల్ ధర రూ.0.22 పైసలు తగ్గి రూ.99.49కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు ఉంటూనే ఉన్నాయి.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.80గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.31 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.28 పైసలు తగ్గి రూ.98.43గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.43 పైసలు తగ్గి రూ.108.35 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.0.37 పైసలు తగ్గి రూ.99.86కు చేరింది.
స్థానిక పన్నుల పెంపు వల్లే ధరల పెరుగుదల..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గకపోగా, పెరుగుతున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 5 నాటి ధరల ప్రకారం 68.28 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి.