అన్వేషించండి

Vanama Venkateswara Rao Disqualification: ప్రభుత్వం పథకం అందుకున్న ఎమ్మెల్యేపై అనర్హత వేటు- సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న వనమా

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

అనర్హత వేటుకు గురైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. ఆయన  ఎన్నిక చెల్లదని పేర్కొంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. దీంతో వెంకట్రావు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తమ పోరాటానికి న్యాయం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ తరఫున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4,139 ఓట్లతో గెలిచారు. వనమాకు 81,118 ఓట్లు రాగా జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వనమా కాంగ్రెస్‌‌ను వదిలి బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారని ఆయన ఎన్నికల చెల్లదని జలగం వెంకట్రావు 2019 జనవరి 25న హైకోర్టును ఆశ్రయించారు. వనమా భార్య ఆస్తుల వివరాలు, ఆయన మీద ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు ఇవ్వలేదని, ఆయన ఎన్నిక రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని పిటిషన్‌ వేశారు. జలగం పిటిషన్‌ రద్దు చేయాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు హైకోర్టు నిరాకరించటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 2021 నవంబరు 8న విచారించి ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించారు. దీంతో గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత ఈ కేసుపై  హైకోర్టు జస్టిస్‌ జీ రాధారాణి ధర్మాసనం పలు దఫాలుగా విచారణ జరిపింది.

‘వివరాలు దాచిపెట్టారు’
జలగం తరఫు న్యాయవాది కే రమేశ్‌ వాదనలు వినిపించారు. వనమా తన ఎన్నికల అఫిడవిట్‌లో 2014 నాటి క్రిమినల్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 127కు సంబంధించిన కేసు వివరాలు, ఆయన భార్య పేరిట న్యూపాల్వంచ ఇందిరానగర్‌లోని 300 చదరపు గజాల ఆస్తి గురించి తెలుపలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి ఆదాయం ఉందని తెలిపిన వనమా ఆయన రెండో పాన్ కార్డు వివరాలు పొందు పరచలేదన్నారు. వనమా కుమారులకు చీరాల, ఏలూరుల్లో రెండు ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని.. చీరాల సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ క్రిస్టియన్‌ మైనార్టీ సొసైటీ కింద మంజూరైందని.. అలాంటప్పుడు హిందూ అవిభాజ్య కుటుంబం ఉండదని వాదించారు. ఉద్దేశపూర్వకంగా వివరాలు దాచిపెట్టడం.. కేసుల వివరాలు వెల్లడించకపోవడం ఓటర్లను మోసం చేయడమే కాకుండా అవినీతికి పాల్పడడమేనని.. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడం కిందికు వస్తుందని వాదనలు వినిపించారు.

పట్టించిన రైతు బంధు
పాల్వంచ మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం పాల్వంచలోని సర్వే నంబర్‌ 122/2/సంస్తాన్‌ 1 ఎకరం 33 గుంటలకు వనమా రైతుబంధు నిధులు తీసుకున్నట్లు వెల్లడించారు. సదరు భూమికి 2018 నుంచి 2021 వరకు దాదాపు ఎనిమిదిసార్లు మొత్తం రూ.69,350 తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపితమైంది. ఆయన భార్య పేరు మీద పాల్వంచలో సర్వే నంబర్‌ 992లో 8.37 ఎకరాల విషయంలో సైతం ఆధారాలు స్పష్టంగా ఉన్నట్లు హైకోర్టు పేర్కొంది. తప్పుడు వివరాలు వెల్లడించడంతోపాటు ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు ఆధారాలతో సహా వెల్లడి కావడంతో వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు ఇచ్చింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన మొత్తం ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget