Minister Harish Rao: విధి నిర్వహణలో మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది
వైద్య సిబ్బంది సేవలు ఎనలేనివని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
కొవిడ్ సమయంలో వైద్య సిబ్బంది సేవలు మరిచిపోలేనివని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎంతో మంది జీవితాలను వారు నిలబెట్టారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వాళ్ల సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. అలాంటి వారి కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. నారాయణపేట జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏఎన్ఎం కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలిపారు.
ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించడం జరిగింది. వరలక్ష్మి గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
— Harish Rao Thanneeru (@trsharish) December 8, 2021
విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న ఏఎన్ఎం.. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి.. ఇటీవల మాగనూరు మండల కేంద్రం నుంచి కొల్పూర్ గ్రామానికి వెళ్తొంది. ఆ సమయంలో లారీ ఢీకొని ఆమె మృతి చెందారు.
కరోనా కష్ట కాలంలో విధుల్లో ఉండి మృతి చెందిన వారి సేవలను మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల బీమా సొమ్ము అందజేస్తామని పేర్కొన్నారు. అంతేగాకుండా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో భాగంగా చనిపోయిన వారి అంత్యక్రియాలను ప్రభుత్వ ఖర్చులతోనే నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు జిల్లా వైద్య అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Also Read: TRS : టీఆర్ఎస్ కోసం సూసైడ్ స్క్వాడ్‌లా పని చేద్దాం.. చల్మెడ చేరిక సభలో మంత్రి గంగుల వ్యాఖ్యలు !