Shilpa Chowdary Black Money: కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?
శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు పెట్టకుండా సొత్తు రికవరీ చేయాలన్న ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో పోలీసులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి అనే మహిళ కిట్టీ పార్టీలు ఇచ్చి రూ. 200 కోట్ల మోసం చేసిందని.. అందులో సినీ ప్రముఖులు ఎక్కువగా ఉన్నారన్న ప్రచారం కలకలం రేపింది. దానికి తగ్గట్లుగానే ఓ యువ హీరో.. మరో హీరో భార్య.. ఇలా కొంత మంది డబ్బులిచ్చినట్లుగా బయటకు వచ్చింది. కానీ ఎక్కువ మంది కేసు పెట్టకుండా తమ డబ్బులిప్పిచ్చాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు ఆమెపై ఫిర్యాదు చేయడం లేదు...? ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి రావని భయపడుతున్నారా ? బ్లాక్ మనీ గుట్టు రట్టవుతుందని ఆందోళన చెందుతున్నారా ?
Also Read : భారత్-మయన్మార్ సరిహద్దులో రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత... అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
రూ.200 కోట్లు వసూలు చేసినట్లు రూమర్స్ ..కానీ ముగ్గురే ఫిర్యాదు !
రూ. 2కోట్ల 50 లక్షల తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ శిల్పా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత మహేష్ బాబు సోదరి హీరో సుధీర్ బాబు భార్య కూడా ఫిర్యాదు చేసింది. ఆమెకు మూడు కోట్లు టోకరా వేసినట్లుగా భావిస్తున్నారు. మరొకరు కూడా ఫిర్యాదు చేశారు. అంతే వీరందరిదీ కలిపినా రూ. ఆరేడు కోట్ల మోసమే. మరి రూ. రెండు వందల కోట్లు ఎవరిచ్చారు..? వారు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు ? ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను సినీ ప్రముఖుల నుంచి ఇండస్ర్టీయలిస్ట్‌ల వరకు బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించిందని భావిస్తున్నారు. ప్రధానం ఆమె అస్త్రం.. బ్లాక్ మనీని వైట్ చేయడం. అందుకే ఆమెకు అత్యధికంగా నగదు ఇచ్చారు.
Also Read : భార్య వాట్సప్ చాటింగ్ చూసేవాడు.. అనుమానంతో వేధించేవాడు.. చివరకు..
అదంతా అక్రమ డబ్బే .. అందుకే ఫిర్యాదుకు రావడం లేదా !?
మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే అదంతా నల్లధనం . వారి ఆస్తులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఒక్క బాధితురాలు ఏకంగా రూ.11 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారెవరో ఇంత వరకూ ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేపడుతున్నారు. అందరూ డబ్బులిచ్చిన బడాబాబులే కావడంతో ఫిర్యాదు చేయం కానీ తమ డబ్బులు తమకు ఇప్పించాలని మాత్రం ఉన్నత స్థాయిలో పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!
రూ. కోట్లన్నీ డబ్బులన్నీ ఎక్కడికి తరలిపోయాయి..!
డబ్బంతా ఆమె ఎక్కడికి తరలించిందనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.శిల్పాచౌదరి నిర్మాతగా టాలీవుడ్‌లో సెహరి సినిమా నిర్మాణం చేపట్టారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఆమె 12శాతం వాటాదారుగా ఉన్నట్టు గుర్తించారు. రూ.కోట్టలో నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు ఇతరులు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తే.. కేసు విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. అందుకే రెండో సారి శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సొత్తు రికవరీకే పోలీసుల ప్రయత్నం !
ఇందులో పెద్ద పెద్ద వారి డబ్బులు ఉండటంతో పోలీసులు సొత్తు రికవరీపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్‌లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉన్నారు. ఆమెను శిక్షించడం కన్నా తమ డబ్బు తమకు వచ్చేలా చేయమని అడిగేవారి సంఖ‌్యే ఎక్కువగా ఉంది. అందుకే అందరి డబ్బులు ఎక్కడున్నాయన్నదానిపైనే పోలీసులు ఆమె నుంచి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత పక్కాగా స్కెచ్ వేసిన శిల్పా.. డబ్బు మాత్రం ఎక్కడ ఉందో తేలికగా చెబుతోంది. తనను ఇతరులు మోసం చేసారని పోలీసులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో గుట్టు బయటకు రావడం లేదు.
Also Read: Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ
శిల్పా చౌదరి గుట్టు రట్టయితే బ్లాక్ మనీ రాకెట్ కూడా బయటకు వస్తుందా !?
బ్లాక్ మనీని తీసుకున్న శిల్పా చౌదరి అందర్నీ మోసం చేసింది. వారంతా ఇచ్చింది బ్లాక్ మనీ కావడంతో ఆధారాలు కూడా లేవు. సమాజంలో తాడి దన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటాడని అంటారు. అంటే అక్రమ దందాలతో డబ్బు సంపాదించేవారు ఒకరు ఉంటే..వారిని మోసం చేసేవాళ్లు మరి కొందరుంటారు. శిల్పా చౌదరి లాంటి వాళ్లు అలా బయటకు వస్తూనే ఉంటారు.