News
News
X

Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు

ఇంతటి దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆమె గర్భిణీ అని కూడా చూడకుండా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

FOLLOW US: 
Share:

మహారాష్ట్రలో ఓ పరువు హత్య చోటు చేసుకుంది. ఓ యువతిని ఆమె సొంత సోదరుడే నరికి చంపాడు. అందుకు తల్లి సాయం పొందాడు. అంతేకాక, తన సోదరిని చంపాక మొండెం నుంచి తలను వేరు చేసి ప్రదర్శించడం విస్మయం కలిగిస్తోంది. ఆ తలను ఎత్తిపట్టి చూపి, నిందితుడు ఇరుగు పొరుగు వారికి ప్రదర్శించాడు. ఇంతటి దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆమె గర్భిణీ అని కూడా చూడకుండా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

పోలీసులు, స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయిన 19 ఏళ్ల యువతి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. తన భర్తతో కలిసి వైజాపుర్‌లోని అత్త గారింటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గత వారం యువతి తల్లి ఆమె అత్తగారింటికి వెళ్లి, అయిందేదో అయిందని పుట్టింటికి రావాలని కోరింది. ఆదివారం కుమారుడితో కలిసి మరోసారి వారి ఇంటికి వెళ్లింది. తల్లి, సోదరుడు వచ్చాడని.. వారి కోసం ఆమె వంటింట్లో టీ పెడుతుండగా.. నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు. వంట గదిలో టీ పెడుతుండగా సోదరుడు వెనుక నుంచి కొడవలితో వచ్చి ఒక్కసారిగా సోదరిపై దాడి చేశాడు. తల్లి ఆమె కాళ్లు పట్టుకొని సహకరించగా.. అతను ఆమె తల నరికి చంపాడు. అనంతరం శరీరం నుంచి తలను వేరు చేసి, చుట్టుపక్కల ఉన్న వారికి చూపించాడు. 

బావపైన కూడా హత్యాయత్నం..
సోదరిని చంపే సమయంలో అప్పటికే అనారోగ్యంతో ఉన్న యువతి భర్త.. మరో గదిలో నిద్రలో ఉన్నాడు. వంట గదిలో గిన్నెలు పడిపోతున్న శబ్దం విని, ఏం జరుగుతోందో చూసేందుకు వచ్చాడు. దీంతో ఆ ఆ మైనర్ వ్యక్తి అతనిపై కూడా దాడికి యత్నించాడు. కానీ, అతను త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు తానే లొంగిపోయినట్లు వీర్‌గాం పోలీసులు వెల్లడించారు. అంతకుముందు నరికిన తన సోదరి తలతో బాలుడు, అతని తల్లి ఫోన్‌తో సెల్ఫీలు దిగినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు.

Also Read: Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Dec 2021 08:57 AM (IST) Tags: Honour Killings Minor murder sister aurangabad Honour Killing aurangabad Death marriage death

సంబంధిత కథనాలు

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!