Mlc Kavitha : దేశవిదేశాల్లో బతుకమ్మ వేడుకలు, పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha : శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బతుకమ్మ వేడుకల పోస్టర్ కవిత ఆవిష్కరించారు.
Mlc Kavitha : శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎనిమిది దేశాల్లో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. యూకే, ఖతర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, కువైట్, దుబాయ్, స్విట్జర్లాండ్, ముంబయిలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారని కవిత తెలిపారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఎమ్మెల్సీ కవిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Thankful to our @trspartyonline & @TJagruthi Family members at Kalvakurthy for such warm welcome. pic.twitter.com/Xyx1WUOvlU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 24, 2022
కవితకు ఘన స్వాగతం
అంతకముందు శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వెల్లిన ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.
శ్రీశైలం సన్నిధికి రావడం అదృష్టంగా భావిస్తా
శ్రీశైలం దేవస్థానానికి తెలంగాణ నిత్యం భక్తులు వస్తుంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శ్రీశైలం సన్నిధికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్ని సార్లు వచ్చినా మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని చూస్తే తనివి తీరదన్నారు. గతంలో కన్నా ఇప్పటికీ శ్రీశైలంలో అభివృద్ధి కనిపిస్తోందన్న ఎమ్మెల్సీ కవిత, తిరుపతి మాదిరిగా శ్రీశైలం కూడా ఎదగాలని కోరుకుంటున్నాని తెలిపారు.
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో రేపటి నుంచి జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూకే, ఖతర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, కువైట్, దుబాయ్, స్విట్జర్ల్యాండ్, ముంబయిలలో జరిగే బతుకమ్మ వేడుకల పోస్టర్ లను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. దీంతోపాటు తెలంగాణ జాగృతి ఖతర్, తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ ఆధ్వర్యంలో రూపొందిన బతుకమ్మ ప్రోమోలను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి వివిధ దేశాల శాఖల ప్రతినిధులు, జాగృతి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Also Read : Munugode Bypolls Bjp : మండలానికి ముగ్గురు ఇంచార్జులు - మునుగోడును ముట్టడిస్తున్న బీజేపీ !