అన్వేషించండి
Advertisement
Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!
Indian Railway: దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Indian Railway: కరోనా కారణంగా దేశంలోని చాలా రైళ్లను భారత రైల్వే.. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రైళ్లను తిరిగి పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ట్రైన్ నెంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి తిరిగి ప్రారంబించనున్నారు. ఈ రైలు 9.55 గంటలకు కాచిగూడ నుంచి బయలు దేరి 3.50 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
SCR to restore 12 daily passenger trains @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/c4aTGeEVGt
— South Central Railway (@SCRailwayIndia) July 20, 2022">
- రైలు సర్వీసు నంబర్ 07596/old TR No. 57690 కాచిగూడ-నిజామాబాద్ రైలును జులై 22వ తేదీ నుంచి పునః ప్రారంబించనున్నారు. ఈ రైలు 14.55 గంటలకు బయలుదేరి 18./30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
- 07432/ Old TR No. 67264 సికింద్రాబాద్-వరంగల్ సర్వీసు జులై 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు 09.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 13.15 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.
- 07463/ Old TR No. 67267 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వీసు 13.45 గంటలకు బయలు దేరి 18.05 గంటలకు గమ్య స్థానం చేరుకుంటుంది.
- 07979/Old TR No. 67245 విజయవాడ-భ్రదాచలం మధ్య తిరిగే ట్రైన్ జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి గంటలకు భద్రాచలం చేరుకుంటుంది.
- 07278/Old TR No. 67246 భద్రాచలం-విజయవాడ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 7.50 గంటలకు భద్రాచలం నుంచి బయలు దేరి 12.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
- 07893/ Old TR No. 77259 నిజామాబాద్-కరీంనగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 4.45 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 7.55 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
- 07894/Old TR No.77260 కరీంనగర్-నిజామాబద్ మధ్య తిరిగే సర్వీసు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 14.35 గంటలకు కరీంనగర్ నుంచి బయలు దేరి 20.40 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది.
- 07765/Old TR No.77256 సిర్పూర్-కరీంగర్ మధ్య తిరిగే రైలు జులై 25 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈరైలు 11.50 గంటలకు సిర్పూర్ నుంచి బయలు దేరి 14.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది.
- 0759/Old TR No.57605 సికింద్రాబాద్-వికారాబాద్ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ రైలు 07.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి 09.40 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
- 07591/ Old TR No.57606 వికారాబద్-కాచిగూడ మధ్య తిరిగే రైలు ఆగస్టు 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ రైలు 10.55 గంటలకు వికారాబాద్ నుంచి బయలు దేరి 13.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement