Trains Cancelled: పట్టాలు తప్పిన గూడ్స్ - పలు రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
Khammam News: ఖమ్మం - విజయవాడ మార్గంలో గూడ్స్ రైలు ప్రమాదానికి గురి కావడంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది.
South Central Railway Cancelled Some Trains: ఖమ్మం - విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేట్ సమీపంలోని రైలు రాగానే భారీ శబ్ధాలు రాగా.. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపేశారు. రెండు భోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ రైళ్లు రద్దు
మరమ్మతులు జరుగుతున్న క్రమంలో శనివారం విజయవాడ, కాజీపేట మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెం.07464), గుంటూరు - విజయవాడ (ట్రైన్ నెం.07465), విజయవాడ - డోర్నకల్ (ట్రైన్ నెం.07756), డోర్నకల్ - కాజీపేట (ట్రైన్ నెం.07754) రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డోర్నకల్ - విజయవాడ (07755) రైలును దారి మళ్లించారు.
Cancellation/Partial Cancellation of Trains pic.twitter.com/Mvp9m2CP3W
— South Central Railway (@SCRailwayIndia) February 17, 2024