అన్వేషించండి

Telangana Musi Project: ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ముందడుగు పడని మూసి ప్రాజెక్ట్ - సీఎం రేవంత్ మాటలకే పరిమితమయ్యారా?

Musi project: తెలంగాణ మూసి ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. ఇతర దేశాల్లో నగరాల్లో పారే నదులను పరిశీలించి వచ్చినా పనులు మాత్రం పట్టాలెక్కలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది.
  • హైదరాబాద్ ను రివర్ సిటీగా మార్చే ప్రణాళికకు ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదు.
  • ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కనిపించినా, ఎటువంటి పురోగతి లేదు.
  • కేంద్రం సహకరించడం లేదని, నిధులు లేవని ఆరోపణలు చేస్తున్నారు.

Telangana Musi project: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రెండేళ్లు అవుతున్నా.. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎంగా  రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టారు.  హైదరాబాద్ ను రివర్ సిటీగా మారుస్తామని లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి వచ్చారు.  రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు ఇంకా డీపీఆరే సిద్ధం కాలేదు.  

మురికి కాలువగా మారిన మూసీ నది 

మూసీ నది, హైదరాబాద్‌కు జీవనాధారం. కృష్ణా నదిలోకి కలిసే ఈ నది, 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఈ నది నగరం మధ్య నుంచి వెళ్తోంది. కానీ గత పాతికేళ్లుగా  కాలుష్యం, పట్టించుకోకపోవడం వల్ల ఇది  మురికి కాలువగా మారింది. 1997లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మూసీని కాంక్రీట్ డ్రైన్‌గా మార్చి, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే ఆలోచన వచ్చింది. కానీ, అమలు కాలేదు.  2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం 2017 మార్చి 25న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ను ఏర్పాటు చేసింది . ప్రీ-ఫీజిబిలిటీ స్టడీలు జరిగాయి, కానీ పెద్దగా అభివృద్ధి లేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన ను ముఖ్య హామీగా చేసుకుంది. రేవంత్ రెడ్డి, సీయోల్ మోడల్‌తో మూసీని మార్చి, హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా చేస్తాం అని ప్రకటించారు. 

అధికారంలోకి రాగానే హడావుడి 

2023 డిసెంబర్ తర్వాత, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపించింది. 2024 జనవరి 2న, సీఎం రేవంత్ రెడ్డి HMDA  అధికారులతో సమీక్షలో 36 నెలల్లో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేయాలి  అని ఆదేశాలు జారీ చేశారు. అందులో పన్నెండు నెలలు గడిచిపోయాయి.  కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు ప్లానేంటో కూడా ఎరికీ తెలియదు.  2024 అక్టోబర్‌లో 141 కోట్లతో 18 నెలల్లో DPR తయారు చేయాలని టెండర్ పిలిచారు.   DPR తర్వాత, 5 సంవత్సరాలు పెట్టుబడి సలహాలు ఇవ్వాలని ప్లాన్. 2025లో బడ్జెట్‌లో 1,500 కోట్లు కేటాయించారు. కానీ వాటితో ఏ పనులు చేయలేకపోయారు. 

కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు   

ఇప్పటి వరకూ మూసీ నది ఒడ్డున  ప్రభుత్వ భూములను  MRDCLకు బదిలీ చేశారు  DPR ఇంకా పూర్తి కాలేదు . ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ ధృవీకరణ లేదు.  ఇంకా లిస్టెడ్  కాలేదు.   DPR లేకుండానే 734 ఎకరాల భూమి బదిలీ  చేశారు.    బ్యాంక్ లోన్లు వచ్చే వరకూ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లడానికి ప్రబుత్వం వద్ద నిధులు లేవు.  కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా, మూసీ ప్రాజెక్టు స్వప్నాలుతో మొదలై, వాస్తవాల వలయంలో చిక్కుకుంది. రెండేళ్లు గడిచినా, పారదర్శకత, పునరావాసం  అనే వాటిపై స్పష్టత లేదు.   కనీసం పనులు జరుగుతూ ఉంటే.. చేస్తున్నారని అనుకుంటారు. అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదని ప్రజలు అనుకునే ఎక్కడిదక్కడ ఆగిపోపోయింది. ఇక ముందైనా మూసి ప్రక్షాళనకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ఘటన.. పోలీసుల అదుపులో సాజిద్- బిల్డర్‌గా మారిన మెకానిక్
గచ్చిబౌలి బిల్డింగ్ ఘటన.. పోలీసుల అదుపులో సాజిద్- బిల్డర్‌గా మారిన మెకానిక్, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget