అన్వేషించండి

Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL  ఇప్పుడు బొగ్గు మైనింగ్ దాటి కొత్త అడుగులు వేస్తోంది. బంగారు గని తవ్వుకం చేపట్టనుంది. కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్‌ను Explore చేయబోతోంది

Singareni Goldmine:  బొగ్గే బంగారం అన్నది సింగరేణి నినాదం... విధానం. ఇప్పుడు బొగ్గును బంగారంగా చూడటం కాదు.. నిజమైన బంగార గనుల తవ్వకాన్ని చేపట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ తమ అధీనంలో  ఉన్న దేవదుర్గ గోల్డ్ కాపర్‌ బ్లాక్‌లో బంగారు తవ్వకాలు చేపట్టనుంది. ఇకపై బొగ్గుకే పరిమితం కాకుండా  బంగారం, రాగి వంటి కీలక ఖనిజాల అన్వేషణనూ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దేవదుర్గకు భట్టి విక్రమార్క

తెలంగాణ డిప్యూటీ, మైనింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా ఇవాళ దేవదుర్గ గోల్డ్‌ బ్లాక్‌ను సందర్శించనున్నారు. సింగేణి ప్రాజెక్టు పురోగతిపై బుధవారం సమీక్ష నిర్వహించిన భట్టి గోల్డ్‌ మైనింగ్ పై ఫోకస్ పెట్టారు. అందుకే ఆయన దేవదుర్గ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించబోతున్నారు. దేవదుర్గ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ఇతర సహకారాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని భట్టి అధికారులకు సూచించారు.

బొగ్గు నుంచి ‘క్రిటికల్ మినరల్స్’ దిశగా...

సింగరేణికి బొగ్గు గనుల నిర్వహణలో దశాబ్దాల అనుభవం ఉంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంపై ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రస్తుతం కర్ణాటకలో తమ అధీనంలో దేవదుర్గ బ్లాక్‌లో రాగి బంగారు అన్వేషణ మాత్రమే కాకుండా.. గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల అన్వేషణలోనూ అవకాశాలను  వెతకాలని సింగరేణి నిర్ణయించింది.  రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో క్రిటికల్ మినరల్స్‌కు ప్రాధాన్యం ఉండబోతోంది. ఇప్పటి వరకూ బొగ్గుగే పరిమితం అయిన సింగరేణి కొత్తరంగాలకు విస్తరించగలిగితే.. సంస్థకు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి. 

దేవదుర్గ ఎందుకు కీలకం?

కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణకు సింగరేణి ఇప్పటికే అడుగు పెట్టింది. 2025లో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో SCCL ఈ  బ్లాక్‌కు L-1 బిడ్డర్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్టును సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం పర్యవేక్షణలో ముందుకు తీసుకెళ్లనుంది. ఈ గనిలో తవ్వకాలు ఎంత వరకూ లాభదాయకం, అక్కడ నిక్షేపాల పరిమాణం, నాణ్యత, జియోగ్రాఫికల్ పరిస్థితులు వంటి అంశాలపై ముందుగా అధ్యయనం చేస్తారు. 

సింగరేణికి ఇది కొత్త అధ్యాయం?

ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచే బొగ్గుతో గుర్తింపు పొందిన సింగరేణి... ఇప్పుడు నిజమైన ‘గోల్డ్’నే వెలికితీయబోతోంది. ఇది కనుక సక్సెస్‌ అయితే తెలంగాణ పాలిట ఇదొక గోల్డ్‌మైనే..!  Goldmine   దేవదుర్గలో భట్టి విక్రమార్క పర్యటనతో ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసలు అక్కడ ఎంత బంగారం ఉంది? ఎంత రాగి ఉంది? అన్వేషణ తర్వాత వాణిజ్యపరంగా తవ్వకాలు సాధ్యమవుతాయా? — ఈ ప్రశ్నలకు రాబోయే అధ్యయనాలే సమాధానం చెప్పనున్నాయి

 

Frequently Asked Questions

సింగరేణి సంస్థ ఇప్పుడు ఏ కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తోంది?

సింగరేణి బొగ్గు తవ్వకాలతో పాటు దేవదుర్గ గోల్డ్ కాపర్ బ్లాక్‌లో బంగారం, రాగి తవ్వకాలను చేపట్టబోతోంది. భవిష్యత్తులో గ్రాఫైట్, లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణను కూడా లక్ష్యంగా చేసుకుంది.

సింగరేణి చేపట్టబోయే బంగారు, రాగి తవ్వకాలు ఎక్కడ జరగనున్నాయి?

సింగరేణి కర్ణాటకలోని దేవదుర్గ గోల్డ్ కాపర్ బ్లాక్‌లో బంగారు, రాగి తవ్వకాలను చేపట్టనుంది. ఈ బ్లాక్ సింగరేణి ఆధీనంలో ఉంది.

మైనింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దేవదుర్గను ఎందుకు సందర్శిస్తున్నారు?

దేవదుర్గ గోల్డ్ బ్లాక్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడానికి, అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి మంత్రి భట్టి విక్రమార్క సందర్శిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం కోసం కూడా ఆయన సూచించారు.

సింగరేణి బొగ్గుతో పాటు ఇతర ఖనిజాల అన్వేషణను ఎందుకు విస్తరిస్తోంది?

మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి సింగరేణి దృష్టి పెట్టింది. కీలక ఖనిజాలకు భవిష్యత్తులో డిమాండ్ ఉండటంతో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget