అన్వేషించండి

Konda Surekha: కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?

Konda Surekha Silent Mode: పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన రిపోర్టు హైకమాండ్‌కు చేరింది. మంత్రి పదవికి రాజీనామా చేస్తే కొండా సురేఖ దంపతులు ప్లాన్ బీ అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Konda Surekha Resignation Rumours MLA Post:  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, సొంత శాఖలోనూ తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం పూర్తిస్థాయి మౌనం పాటిస్తున్నారు.  బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన వైఖరిని, ఎదురవుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించి వచ్చిన తర్వాత ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇకపై మీడియాతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పడం,  క్రమశిక్షణా కమిటీ అధిష్టానానికి నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది.

హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్ 

తన శాఖలోని అధికారులను తనకు తెలీకుండానే మాతృశాఖలకు పంపడం, ఓఎస్డీ సెటిల్మెంట్ల వ్యవహారంలో చట్టపరమైన విచారణలు వేగవంతం కావడం వంటి అంశాలపై సురేఖ తన అసంతృప్తిని ఇప్పటికే హైకమాండ్ ముందు ఉంచారు. అధిష్టానానికి పరిస్థితిని వివరించిన తర్వాత, తన బాధ్యత ముగిసిందన్నట్లుగా ఓ రోజు సెక్రటేరియట్‌లో విధులు నిర్వహించిన ఆమె.. ఇప్పుడు వెయిట్ అండ్ సీ  ధోరణిని అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తనను కేబినెట్ నుంచి తప్పిస్తుందా లేక నష్ట నివారణ చర్యలు చేపడుతుందా అనే అంశం ఆధారంగానే సురేఖ దంపతులు తమ తదుపరి అడుగులు వేయనున్నారు.  

మాట్లాడితే వివాదం.. మౌనం పాటిస్తే వ్యూహం.  

కొండా సురేఖ ప్రస్తుత సైలెన్స్ కేవలం నిశ్శబ్దం కాదు, అధిష్టానం నిర్ణయం ఆధారంగా రాజకీయ దారి మార్చుకోవడానికి వేస్తున్న ముందస్తు ప్రణాళికగా అనుకోవచ్చు.  ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకే మొగ్గు చూపి, ఆమెతో బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయిస్తే పరిస్థితి ఏంటి  అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత చరిత్రను పరిశీలిస్తే కొండా సురేఖ దంపతులు ఏ పార్టీలో ఉన్నా తమ స్వయంప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. కేవలం మంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా పార్టీలో ప్రాధాన్యత తగ్గితే.. ఆమె కేవలం కాంగ్రెస్‌లోనే ఉండిపోతారా లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తమ సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో సవాలు విసురుతారా అనేది కీలక ప్రశ్న.

మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా

మంత్రి పదవిని కోల్పోతే  ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బై-ఎలక్షన్  కు వెళ్లే సాహసం కొండా మురళి, సురేఖ దంపతులు చేయవచ్చనే టాక్ వరంగల్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. తమకున్న బలమైన బిసి కేడర్, వ్యక్తిగత ఇమేజ్‌ను నమ్ముకుని ఉపఎన్నికకు వెళ్లడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ,  కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి రాజకీయ సవాలు విసిరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తమపై కఠిన చర్యలు తీసుకుంటే, బిసి సెంటిమెంట్‌ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ ఉపఎన్నిక మార్గాన్ని ఎంచుకోవచ్చు. తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల దృష్ట్యా బలమైన బిసి నాయకత్వం కోసం వెతుకుతోంది. కొండా సురేఖ దంపతులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

బీజేపీ ఆప్షన్ ఉండనే ఉంది!

ఒకవేళ కాంగ్రెస్ నుంచి వైదొలిగితే బిజెపి తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థిగా సార్వత్రిక లేదా ఉపఎన్నికల బరిలోకి దిగడం సురేఖ దంపతులకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది.  కొండా సురేఖ మౌనం అనేది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అధిష్టానం ఇచ్చే ఫైనల్ రిపోర్టు లేదా తీసుకునే నిర్ణయమే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రాజకీయ ఆధిపత్య రగడకు దారితీస్తుందా లేదా అనేది తేల్చనుంది. కొండా దంపతుల తదుపరి అడుగు కాంగ్రెస్ పార్టీకి వరంగల్ రీజియన్‌లో మునుపటి కంటే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Assembly Seat: దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
Khairatabad bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖరారు - గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ఎందుకు వెనకడుగు వేస్తోంది?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖరారు - గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ఎందుకు వెనకడుగు వేస్తోంది?
CJP election boycott call: సీజేపీ దీప్కే సలహా - విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
సీజేపీ దీప్కే సలహా - విపక్షాలు ఎన్నికలు బహిష్కరిస్తే ఏం జరుగుతుంది?
Danam Nagender mind game: దానం నాగేందర్ బిగ్ మైండ్ గేమ్ - ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ మంత్రి పదవి షరతు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్!?
దానం నాగేందర్ బిగ్ మైండ్ గేమ్ - ఖైరతాబాద్ ఉపఎన్నిక వేళ మంత్రి పదవి షరతు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్!?
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget