GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
GV Narayanarao Death : ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Senior Actor GV Narayanarao Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన మృతిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. నారాయణరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిరంజీవికి ఆప్తమిత్రుడు
కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాబ్యాసం గుంతకల్లులో సాగింది. చదువుకునే రోజుల్లోనే నటనపై ఇష్టంతో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలు వేశారు. దివంగత నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు రంగస్థల మిత్రులు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవికి నారాయణరావు ఆప్తమిత్రుడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన స్నేహితుడిగా నటించారు. అలాగే, కొన్ని సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించారు.
100కు పైగా సినిమాలు
నారాయణరావు కెరీర్‌లో 100కు పైగా మూవీస్‌లో నటించారు. కొన్నింటిలో ప్రధాన పాత్రలు, మరికొన్నింటిలో సహాయ పాత్రల్లో చేశారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' మూవీతో నటుడిగా పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీకే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నంది అవార్డు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్‍లకు మంచి మిత్రుడే. ముత్యాల పల్లకి, అంతులేని కథ, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి మూవీస్‌లో నటించారు.
నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలను నిర్మించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లినీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ ఆయన నటించారు.
Also Read : Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
Before You Go
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు























