News
News
X

Modi on Coal Mines :సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు?

తెలంగాణలో బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారా?. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు?

FOLLOW US: 
 
తెలంగాణలో బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం మౌనంగా ఉన్నారు. విన్నపాలు వినిపించినా వినపడన్నట్లు ఎందుకు ఉన్నారు? రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన గాయాలను ఎందుకు తొలగిపోయాలా చేయడం లేదు?  అన్న ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాకర్టీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. బొగ్గు గనుల్లో కేంద్రానికి 49 శాతం వాటా మాత్రమే ఉందని స్పష్టం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఆలోచన చేయడం లేదని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమే అనవసరంగా ప్రజలు,ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఈ మాటల ద్వారా బొగ్గు గనుల ప్రైవేటీకరణ లేదన్నది అర్థమయ్యేలా చెప్పడమే కాదు ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చినట్లైంది. తెలంగాణలో గతకొంతకాలంగా కేసీఆర్ వర్సెస్‌ మోదీ ఫైట్‌ నడుస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ అవినీతి పాలన అంతుచూస్తామని అప్పుడు ఇప్పుడు కూడా మోదీతో పాటు బీజేపీ పార్టీ చెబుతూ వస్తోంది. అందులో భాగంగానే లిక్కర్‌ స్కామ్‌, గ్రానైట్, మైనింగ్ స్కామ్‌ లను వెలుగులోకి తెచ్చి కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన ఇదంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

ఎమ్మెల్యేల కోనుగోళ్ల వ్యవహారాన్ని టీఆర్‌ ఎస్‌ బయటపెట్టి దేశమంతటా కాషాయం కుట్రలు చూడండని సినిమా చూపించింది. ఇలా నువ్వానేనా అన్న రేంజ్‌ లో కేసీఆర్-మోదీ యుద్ధం సాగుతోంది. ఎలాగైనా సరే తెలంగాణలో కమలం వికసించేలా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ బొగ్గు గనుల ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారు. కానీ ఏపీ విషయంలో మాత్రం అధికారపార్టీనే కాదు విపక్షాలు కూడా పోరాటాన్ని చూపించలేకపోతున్నాయి. ప్రత్యేకహోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రజలు, ఉద్యోగులు పోరాటం చేస్తుంటే రాజకీయ ప్రయోజనం చూసుకున్నాయో కానీ కేంద్రంపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేకపోయారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు గట్టిగా ఉంటేనే మా పార్టీ మద్దతు ఇస్తుందని జనసేన అధినేత చెప్పారే కానీ, విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అన్న విషయం  గుర్తుంచుకొని పార్టీ తరపున గట్టిగా పోరాటం చేసి ఉంటే , టెక్నాలజీని తెచ్చి అంతర్జాతీయంగా హైదరాబాద్‌ పేరుని వినపడేలా చేశానని చెప్పుకునే చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో తగ్గకుండా ఉండి ఉంటే ఈరోజు ఏపీ ప్రజల భవిష్యత్‌ బాగుండేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు మోదీ విశాఖ పర్యటనలో ఉద్యోగులు, కమ్యూనిస్ట్‌ లు, ప్రజాసంఘాలు తప్పించి ఎవ్వరూ కూడా గట్టిగా ప్రధానికి నిరసన సెగ చూపించలేకపోవడం వల్లే  ప్రధాని మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో అధికారం కోసం చూస్తోన్న బీజేపీ అక్కడి రాజకీయాల్లో బలంగా మారేందుకే ప్రస్తుతం బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశాన్ని వాయిదా వేసిందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అంచనా వేస్తున్న విధంగా తెలంగాణలో ఆపార్టీ బలమైన ప్రతిపక్షంగా మారినా, లేదంటే అధికారంలోకి డబుల్‌ ఇంజిన్‌ తో వచ్చినా బొగ్గు గనుల ప్రైవేటీకరణ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందని రాజకీయవిశ్లేషకులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణంగా పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు.గత ఎనిమిదేళ్ల అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు.  గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేయడం, పథకాలు కుదించడం, ప్రభుత్వ ఆస్తులను చాలావరకు ప్రైవేటీకరణ చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు రాజకీయవిశ్లేషకులు. 

Published at : 12 Nov 2022 10:29 PM (IST) Tags: PM Modi AP News Singareni Pawan Kalya TDP CM KCR

సంబంధిత కథనాలు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

CBI Kavita : 11వ తేదీన వస్తాం - కవితకు సీబీఐ రిప్లై !

CBI Kavita :  11వ తేదీన వస్తాం - కవితకు సీబీఐ రిప్లై  !

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Bhadradri News : ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టారు - కోర్టు ఫైన్ వేసింది ! కానీ నేరమేంటో ఆ ఎద్దు ఓనర్‌కు ఇంకా అర్థం కావట్లే

Bhadradri News : ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టారు - కోర్టు ఫైన్ వేసింది ! కానీ నేరమేంటో ఆ ఎద్దు ఓనర్‌కు ఇంకా అర్థం కావట్లే

టాప్ స్టోరీస్

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !

KTR Vs Bandi Sanjay :  కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస - టెస్టులకు శాంపిల్స్ ఇవ్వాలని బండి సంజయ్ సవాల్ !