Covid Cases : గురుకుల పాఠశాలలో కరోనా కలకలం, 20 మందికి పాజిటివ్
Covid Cases : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని గురుకుల బాలికల పాఠశాలలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Covid Cases : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 500 పైగా నమోదు అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఈ పాఠశాలలో మొత్తం 20 మందికి కరోనా సోకింది. సోమవారం పాఠశాలలో జ్వరంతో ఉన్న విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కరోనా పరీక్షలు చేశారు. ముందు ముగ్గురికి పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమైన పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది సిబ్బందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మంది విద్యార్థినులకు, ఇద్దరు జూనియర్ లెక్చరర్లు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్ వచ్చిన 16 మంది విద్యార్థినులను ఇంటికి పంపిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 771 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురిచేస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39,320 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో కొత్తగా 771 మందికి కరోనా పాజిటివ్ తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 289 కరోనా కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 53 కేసులు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 కేసులు, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు, నల్గొండ జిల్లాలో 28 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 581 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కరోనా బులెటిన్
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,20,617 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8 లక్షల 10 వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,773గా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనాతో 4111 మంది మరణించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం కరోనా బులెటిన్ విడుదల చేసింది. నిన్న రాష్ట్రంలో 32 వేల 834 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 705 మందికి పాజిటివ్ గా తేలింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) August 1, 2022
(Dated.01.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/c1eBXU3kxE