RRB Exam Special Trains : ఆర్ఆర్బీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
RRB Exam Special Trains : ఆర్ఆర్పీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలకు ఈ రైళ్లు తిరగనున్నాయి.
RRB Exam Special Trains : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఆర్ఆర్బీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆర్ఆర్బీ పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వెళ్లేందుకు వీలుగా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ రైళ్లను నడిపే తేదీలతో పాటు బయలుదేరే సమయాలు, ఆగే స్టేషన్ల వివరాలను ట్విట్టర్ లో అందుబాటులో ఉంచింది. గతంలో కొన్ని రైళ్లను ప్రకటించి దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక రైళ్లు
తిరుపతి-సేలం, సికింద్రాబాద్-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి. ట్రైన్ నంబర్ 07675/07676 తిరుపతి-సేలం, 07441 నంబర్ గల ట్రైన్ సేలం-తిరుపతి తిరగనున్నాయి. ఈ నెల 12న తిరుపతి-సేలం, 13వ తేదీన సేలం-తిరుపతి మధ్య ట్రైన్ నంబర్ 07442 నడపనున్నారు. 13వ తేదీన షాలిమార్-సికింద్రాబాద్ (08025), తిరిగి 16వ తేదీన సికింద్రాబాద్-షాలిమార్ (08026), 14న షాలిమార్-సికింద్రాబాద్ (08035), 17న సికింద్రాబాద్-షాలిమార్ (08036) ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచనున్నారు. ఆర్ఆర్బీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
RRB Examination Specials @drmgtl @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/5TG15WAp70
— South Central Railway (@SCRailwayIndia) June 10, 2022
ఎక్కడెక్కడ ఆగుతాయంటే?
తిరుపతి-సేలం మధ్య నడిచే రైలు చిత్తూరు, కాట్పాడి, జోలార్పెట్టై స్టేషన్ లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో సేలం-తిరుపతి రైలు జోలార్పెట్టై, కాట్పాడి, చిత్తూరు స్టేషన్లలో ఆగనుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-షాలిమార్ మధ్య నడిచే రైలు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్ పుర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పుర్ స్టేషన్లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో ఇదే స్టేషన్లలో ఆగనుంది.
RRB Examination special trains between various destinations #RRBNTPC @drmgtl @drmsecunderabad @VijayawadaSCR @drmhyb pic.twitter.com/Ty6eNnO6r9
— South Central Railway (@SCRailwayIndia) June 10, 2022