News
News
X

KTR Letter : కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో 35వేల ఓట్ల తొలగింపు అక్రమం- కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR Letter : ఓట్లను తొలగించడమంటే ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని మంత్రి కేటీఆర్ అన్నారు.

FOLLOW US: 
Share:

KTR Letter : కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 35వేల మంది పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని కేటీఆర్ లేఖలో వివరించారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని లేఖలో రాశారు.  

లేఖలో ప్రధానాంశాలివే

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగింది. తొలగించిన ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా, వారికి రాజ్యాంగం కలిగించిన ఓటు హక్కును దూరం చేయడం ఆక్రమం. కంటోన్మెంట్ బోర్డ్ కు, విద్యుత్ శాఖకు, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులను చెల్లిస్తున్నారు. గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వీరి హక్కులను హరించేలా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించింది.

అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సాహేతుకంగా లేదని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటిదాకా దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు ఆక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదన్నారు. తొలగించిన ఓటర్లను అక్రమంగా నివాసం ఉంటున్నారని రుజువు చేయకుండానే, నేరుగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయం అని కేటీఆర్ లేఖలో ప్రశ్నించారు. 2018లో 1,91,849 ఓటర్లు ఉంటే, ఈరోజు వారి సంఖ్య 1,32,722 కు తగ్గడం దురదృష్టకరమన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ చేపడుతున్న ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల వలన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గత ఐదు సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలోని పౌరుల సంఖ్య పెరగకుండా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35 వేలమంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చాలని కేటీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద కంటోన్మెంట్. ఇందులో 8 వార్డులు, 4 లక్షల మంది జనాభా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. బోర్డులో స్థానికుల ఓట్ల ద్వారా వచ్చిన 8 మంది వార్డు మెంబర్లు ఉంటారు. రక్షణ శాఖ నియమించిన వారు 9 మంది సభ్యులుగా ఉంటారు. కాబట్టి నిర్ణయాల్లో రక్షణ శాఖదే పైచేయి. 2006 కంటోన్మెంట్ చట్టం ప్రకారం బోర్డు కార్యకలాపాలు ఉంటాయి. తిరుమలగిరి, ఈస్ట్ మారేడుపల్లి, హకీంపేట, కార్ఖాన, బోయిన్‌పల్లి, కౌకూరు, బొల్లారం ప్రాంతాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోకి వస్తాయి.

Published at : 16 Mar 2023 10:08 PM (IST) Tags: KTR Rajnath Singh Secundrabad Voters contonment

సంబంధిత కథనాలు

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

టాప్ స్టోరీస్

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!